Shalini Pandey | అనుకోకుండా బాలీవుడ్ అవకాశం : షాలినీ పాండే
అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ సంపాదించేసింది జబల్ పూర్ భామ షాలినీ పాండే (Shalini Pandey). ప్రస్తుతం ఈ బ్యూటీ రణ్ వీర్ సింగ్ (Ranveer Singh)తో కలిసి జయేశ్ భాయ్ జోర్దార్ (Jayeshbhai Jordaar) సినిమాతో బాలీవుడ్ (Bollywood ) తెరంగేట్రం చేస్తోంది.

అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ సంపాదించేసింది జబల్ పూర్ భామ షాలినీ పాండే (Shalini Pandey). ఆ తర్వాత మహానటి లాంటి భారీ చిత్రంలో కీలక పాత్రలో మెరిసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ రణ్ వీర్ సింగ్ (Ranveer Singh)తో కలిసి జయేశ్ భాయ్ జోర్దార్ (Jayeshbhai Jordaar) సినిమాతో బాలీవుడ్ (Bollywood ) తెరంగేట్రం చేస్తోంది. తన తొలి హిందీ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా..? అని ఏడాది కాలానికిపైగా ఎదురుచూస్తోంది షాలినీ పాండే. ఇదే విషయమై షాలినీ పాండే మాట్లాడుతూ..సినిమా విడుదల కోసం ఏడాదికిపైగా ఎదురుచూస్తున్నానంది.
థియేటర్లలో ప్రేక్షకుల నా సినిమాను ఎప్పుడు చూస్తారని వెయిట్ చేస్తున్నా. ఇది చాలా మంచి సినిమా. అంతేకాదు చాలా ప్రత్యేకమైన సినిమా కూడా. ఎంతో ప్రేమ, శ్రద్దతో చేసిన చిత్రమిది. ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ సినిమాను ఇష్టపడతారు. పాత్రలతో ప్రేమలో పడిపోతారు. థియేటర్లు తెరిచే వరకు ఉండలేకపోతున్నా..ఎందుకంటే మళ్లీ ఎప్పటిలాగా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లాలి. త్వరలో సినీ ప్రేమికులు థియేటర్ ఎక్స్ పీరియన్స్ ను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. సినిమా విడుదల గురించి ఆలోచించినపుడల్లా చాలా ఎక్జయిటింగ్ కు లోనవుతున్నానని చెప్పుకొచ్చింది షాలినీ పాండే.

యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో మూడు సినిమాలు చేయడం ఖచ్చితంగా నా బాలీవుడ్ తెరంగేట్రానికి ఖచ్చితంగా సాయపడుతుందని నమ్ముతున్నా. యశ్ రాజ్ ఫిలిమ్స్ సినిమాలు చూస్తూ పెరిగాను. యశ్ రాజ్ ఫిలిమ్స్ హీరోయిన్ అనిపించుకోవాలనే నా కల మొత్తానికి నేరవేరింది. ఇంత త్వరగా ఇలాంటి అరుదైన అవకాశం వస్తుందని ఊహించలేదని చెప్పుకొచ్చింది షాలినీ పాండే.
ఇవి కూడా చదవండి..
Vikramarkudu sequel |విక్రమార్కుడు సీక్వెల్ దర్శకుడు ఇతడే..!
Regina Cassandra l షాహిద్, రాశీఖన్నాతో జాయిన్ అయిన రెజీనా కసాండ్రా
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

