దుబాయ్‌లో తెలంగాణ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని తెలంగాణ ప్రవాస ప్రతినిధులు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయనను కలిశారు. గతంలో అమెరికాలోని డాలస్, మలేషియాలో ఎన్నారైలతో నిర్వహించిన సభల తరహాలోనే, దుబాయ్‌లో కూడా తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ అభిమానులు, ప్రవాస తెలంగాణ వారితో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేయాలని కోరారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవాసులను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతాయని, వీటిని మరింత విస్తృతం చేయాలని వారు అభిప్రాయపడ్డారు. ఈ భేటీలో బీఆర్ఎస్ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల, దుబాయ్ ప్రతినిధుల తరఫున కిరణ్ పీచర, రాధారపు సత్యం, సుధాకర్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు