Yuvraj Singh | బాలీవుడ్లో ఇప్పటికే పలువురి క్రికెటర్ల బయోపిక్స్ వచ్చాయి. భారత మాజీ కెప్టెన్లు కపిల్‌దేవ్, అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ జీవిత కథ ఆధారంగా సినిమాలు తెరకెక్కగా.. ఇందులో పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయాయి. తాజాగా మరో క్రికెటర్ బయోపిక్ వెండితెరపై ఆవిష్కృతం కానున్నది. ఆ ఆటగాడు మరెవరో కాదు యువరాజ్ సింగ్. టీమిండియా మాజీ ఆటగాడు జీవితం ఆధారంగా మూవీని చిత్రీకరించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టును భూషణ్ కుమార్, రవి భాగ్ చంద్క సంయుక్తంగా నిర్మించనున్నారు. అయితే, చిత్రం పేరును ఇంకా ఖరారు చేయలేదు. మూవీలో యువీ జీవితంలోని విభిన్న ఘట్టాలను సినిమాలో చూపించనున్నారు. బయోపిక్కు ఇంకా పేరుపెట్టలేదు. ఇందులో హీరో ఎవరు.. ? ఎవరు దర్శకత్వం వహిస్తారు..? అనే వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటించనున్నట్లు అనేది కూడా ఇంకా వెల్లడించలేదు.
త్వరలోనే అన్ని వివరాలు తెలియరానున్నాయి. డీటెయిల్స్ ఇవి చెప్పకుండా.. యువరాజ్ బయోపిక్ త్వరలో తీస్తామని నిర్మాతలు భూషణ్ కుమార్, రవి భాగ్ చందక ప్రకటించారు. ఇద్దరు మేకర్స్‌తో యువి ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. 13 సంవత్సరాల వయసులో క్రికెట్ బ్యాట్ పట్టిన యువీ తొలుత పంజాబ్ అండర్-16 జట్టు తరఫున బరిలోకి దిగాడు. 2000 సంవత్సరంలో అండర్-19 ప్రపంచకప్ ఆడారు. ఇక అదే ఏడాది కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. మిడిలార్డర్ బ్యాటర్‌గా, ఆల్‌రౌండర్‌గా భారత జట్టుకు సేవలందించాడు. యువరాజ్ సింగ్ 2007 ఐసీసీ T20 ప్రపంచ కప్, 2011 ఐసీసీ ప్రపంచ కప్ సాధించడంలోనూ యువరాజ్ కీలకపాత్ర పోషించాడు. 19 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 40 టెస్టులు, 304 వన్డే, 58 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2012లో చివరిగా టెస్టు మ్యాచ్, 2017లో ఆఖరి వన్డే, టీ20 మ్యాచ్ ఆడాడు. 2011 వరల్డ్‌కప్ అనంతరం ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడిన యువీ.. అమెరికాలో చికిత్స తీసుకుని కోలుకున్నాడు. మూవీలో సినిమాలతో పాటు క్యాన్సర్‌పై పోరాటాన్ని చూపించనున్నారు. యువీ బయోపిక్ ప్రకటన నేపథ్యంలో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.