సినిమా స్టార్‌గా చిరకాలం నిలిచిపోవాలంటే నటన ఒక్కటి వస్తే చాలదు. దానికి తగ్గట్టుగా ఫిట్నెస్ కూడా మెయిన్‌టెన్ చేయాలి. ఎందుకంటే.. తెర మీద కనిపించేవాళ్లు ఎంత ఫిట్‌గా కనిపిస్తే.. ప్రేక్షకులకు కూడా చూడాలనిపిస్తుంది. నిజానికి.. హీరోయిన్లకు అయితే అందంతో పాటు ఫిట్నెస్ కూడా చాలా ముఖ్యం. అందుకే.. హీరోయిన్లు.. కాసింత ఖాళీ సమయం దొరికితే చాలు.. వెంటనే జిమ్‌కు చెక్కేస్తారు.
జిమ్‌లో కసరత్తులు చేస్తుంటారు. ఫిట్‌నెస్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా హీరోయిన్లు ఎక్కువగా గడిపేది జిమ్‌లోనే. ఇప్పుడు మీరు పైన చూస్తున్న ఫోటో కూడా స్టార్ హీరోయిన్‌దే. బ్యాక్ నుంచి చూస్తే వెంటనే గుర్తు పట్టలేకపోవచ్చు కానీ.. తను బాలీవుడ్లో టాప్ హీరోయిన్.
ఇప్పటికైనా తను ఎవరో గుర్తు పట్టారా? తను ఎవరో కాదు.. ముద్దు గుమ్మ దిశా పటానీ. తను ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో.. తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా దిశా పటానీ.. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వావ్.. దిశా.. నీ ఫిట్నెస్ గోల్‌కు హేట్సాఫ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దిశా పటానీ.. ఏక్ విలన్ 2 అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యోధా అనే మరో సినిమాలోనూ నటిస్తోంది.