బాలీవుడ్ అగ్రనటి దీపికా పడుకోన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఆమె కాలినడకన కొండపైకి చేరుకున్నారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రస్తుతం దీపికా పడుకోన్ తెలుగులో ప్రభాస్ సరసన ‘కల్కి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.