Dharmendra | బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (89) అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆయన వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన గత కొద్దికాలంగా సమస్యలతో ఇబ్బందులుపడుతున్నారు. గత పది రోజుల కిందట ఆయసు ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఆయన బృందం హెల్త్ అప్డేట్ అందించింది. సాధారణ చెకప్‌లో భాగంగా.. ఆసుపత్రిలో చేర్పించారని.. భయపడాల్సి అవసరం లేదన్నారు. కొద్దిరోజుల కిందట ఆసుపత్రి వద్ద ఫొటో జర్నలిస్టులు ధర్మేంద్ర ఆరోగ్యం గురించి హేమామాలిని ప్రశ్నించిన సమయంలో.. ఆయన బాగానే ఉన్నారంటూ సైగలు చేశారు.
ధర్మేంద్ర వయసు 89 కావడంతో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతకొద్దిరోజుల కిందట వయసు సంబంధిత సమస్యల కారణంగా చికిత్స కోసం అమెరికా వెళ్లారు. తాజాగా మళ్లీ ఆసుపత్రికి వెళ్లడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ధర్మేంద్ర తన కెరీర్ మొత్తంలో అనేక యాక్షన్ చిత్రాల్లో నటించారు. ఆయనను హిందీ సినిమా హీ-మ్యాన్‌గా పిలుస్తుంటారు. ఆయన ‘చుప్కే చుప్కే (1975), ‘ప్రతిజ్ఞ (1975) నుంచి యమ్లా పగ్లా దీవానా (2011) వరకు పలు హాస్య చిత్రాల్లోనూ నటించారు. ధర్మేంద్ర 1980-90లలో క్యారెక్టర్ పాత్రల్లో కనిపించారు. దశాబ్దకాలం పాటు ఆయన వెండితెరపై అనేక చిత్రాల్లో మెరిశారు.