Bollywood | విధి వైపరిత్యాన్ని ఎవరు తప్పించలేరు. విధి తలచుకుంటే రాజుని పేదవాడిని చేస్తుంది. పేదవాడుగా కూడా చేస్తుంది. ఒకప్పుడు బతుకు తెరువు కోసం ఎన్నో కష్టాలు పడ్డ వ్యక్తి ఇప్పుడు కోట్లకి పడగలెత్తాడు. మరి అతనెవరో తెలుసుకోవాలనుకుంటున్నారా.. మరెవరో కాదు అక్షయ్ కుమార్. ట్రావెల్ ఏజెన్సీలో నెలకు రూ.150కి కూలీగా పని చేసిన ఓ నటుడు హోటల్లో వెయిటర్‌గా కూడా పనిచేశారు. చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో తాను 7వ తరగతిలో ఫెయిల్ అయినట్టు ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు అక్షయ్. చాందిని చౌక్‌లోని ఒకే ఇంట్లో 24 మంది కలిసి ఉండేవారట. ఒకే గదిలో అందరు నిద్ర పోవడం వలన బయటకు రాకవడానికి అందరిపై నుండి దూకి రావలసి వచ్చేదట.
కోలకత్తాలోని ఒక ట్రావెల్ ఏజెన్సీలో పని చేస్తున్నప్పుడు తన జీతం రూ.150 నుంచి రూ.200 వరకు ఉండేదట. అప్పట్లో అక్షయ్ నివసించిన ఇంటి అద్దె రూ.100 ఉండేదట .బాలీవుడ్లో అరంగేట్రం చేయడానికి చాలా కాలం ముందు, అక్షయ్ కుమార్ బ్యాంకాక్ లో చెఫ్, వెయిటర్‌గా పని చేసేవాడు. కొన్ని సార్లు పాత్రలు కూడా కడగాల్సి వచ్చేదట. షిఫ్ట్ చివరలో టిప్స్ కోసం తాను ఎంతో ఆశగా ఎదురు చూసి చివరకి నిరాశ చెందేవాడట. అక్షయ్ కుమార్ అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా కాగా, అదే పేరుతో కరాటే టీచర్‌గా ‘ఆజ్’ అనే చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.
ఈ సినిమా తర్వాత తన పేరుని అక్షయ్ హరి ఓం భాటియాగా మార్చుకున్నాడు. బెంగళూరులో ఒక యాడ్ చిత్రీకరణ కోసం వెళుతుండగా, విమానం మిస్ అయింది. అప్పుడు అక్షయ్ అనుకోకుండా పెద్ద అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఫ్లైట్ మిస్ అయిందనే బాధతో తాను మరో అవకాశాన్ని వెతుక్కుంటూ తన పోర్ట్‌ఫోలియోతో ఒక ఫిల్మ్ స్టూడియోకి వెళ్లాడట. అదే అక్షయ్ జీవితానికి కీలక మలుపు. ఆ రోజు సాయంత్రం దీదార్ అనే చిత్రానికి అక్షయ్ హీరోగా సంతకం చేశాడు. ఇక అప్పటి నుండి అక్షయ్ కుమార్ ఒక్కో మెట్టు ఎక్కుతూ బాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా మారాడు. భారతదేశంలోని అత్యంత ధనవంతులైన నటుల్లో అక్షయ్ కూడా ఒకరు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముంబైలో రూ.80 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లా, రూ.2,500 కోట్ల విలువైన ఆస్తులతో పాటు కాస్ట్ లీ కార్లు ఇంకా చాలానే ఉన్నాయి.