హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై రూపొందించిన ‘విజయీభవ కేసీఆర్’ చిత్ర పోస్టర్‌ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ఆవిష్కరించారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా న్యాయవాదులైన సినిమా నిర్మాత, లిరిక్ రైటర్లు పత్తి ప్రవీణ్‌కుమార్, లక్ష్మణ్గంగాను వినోద్‌కుమార్ అభినందించారు. కార్యక్రమంలో డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమ భరత్‌కుమార్, హైకోర్టు బార్ ఉపాధ్యక్షుడు చెంగల్వ కల్యాణ్‌రావు, న్యాయవాదులు దయాకర్‌రెడ్డి, ఎన్ లలితరెడ్డి, బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు పాల్గొన్నారు.