శనివారం 06 మార్చి 2021
Cinema - Jan 19, 2021 , 08:29:16

క్ష‌మాప‌ణ స‌రిపోదు.. అమెజాన్‌ను నిషేధిస్తాం : ‌బీజేపీ

క్ష‌మాప‌ణ స‌రిపోదు.. అమెజాన్‌ను నిషేధిస్తాం : ‌బీజేపీ

సైఫ్ అలీ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన ‘తాండవ్‌’ వెబ్‌‌ సిరీస్‌ హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందని, మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఈ వెబ్ సిరీస్  రూపొందించారంటూ నిరసనలు వెల్లువెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. సోష‌ల్ మీడియాలోను దీనిపై మండిప‌డుతున్నారు. ‘తాండవ్’‌లో హిందూ దేవుళ్లను కించపరిచారని బీజేపీ ఎమ్మెల్యే రామ్‌కదమ్ ముంబైలోని ఘట్కోపర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ల‌క్నోలోను ఈ వెబ్ సిరీస్‌పై కేసు న‌మోదైంది.

తాండవ్ వివాదం ముదురుతున్న క్ర‌మంలో వెబ్ సిరీస్ సంస్థ క్షమాప‌ణ‌లు చెప్పింది.  ఈ సిరీస్‌లోని దృశ్యాలు ఏ ఒక్క‌రిని, ఏ మ‌త విశ్వాసాల‌ను కించ‌ప‌ర్చ‌డానికి ఉద్దేశించిన‌వి కావ‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. వెబ్ సిరీస్‌లోని అంశాల‌న్నీ క‌ల్పిత‌మేన‌ని, దీని వ‌ల‌న ఎవ‌రైన హ‌ర్ట్ అయితే క్ష‌మించాల‌ని కోరింది. అయితే క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ప్ప‌టికీ బీజేపీ శాంతించ‌డం లేదు. వ‌చ్చే మూడు రోజుల‌లో అమెజాన్‌కు వ్య‌తిరేఖంగా ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌క‌పోతే మ‌హారాష్ట్ర వికాస్‌ అఘాడి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేఖంగా నిర‌స‌న‌లు చేస్తాం అంటూ బీజేపీ నాయ‌కుడు రామ్ క‌ద‌మ్ అన్నారు. 

తాండవ్ యూనిట్ అంద‌రిని జైలుకు పంప‌క‌పోతే అమెజాన్ ప్రొడ‌క్ట్స్‌ని బ్యాన్ చేయాలంటూ ప్ర‌చారం చేస్తాము. ఉద్ద‌వ్ ఠాక్రే ప్ర‌భుత్వం హిందువుల మ‌నోభావాల‌ను పట్టించుకోవ‌డం లేదు.  రాష్ట్ర ప్రభుత్వం కనుక ఎఫ్ఐఆర్ దాఖలు చేయకపోతే మేము మా నిరసనను మరింత  ముమ్మరం చేస్తాము. అమెజాన్‌కు , తాండవ్ ఫిలిం మేక‌ర్స్‌కు వ్య‌తిరేఖంగా రానున్న రోజుల‌లో మా నిర‌స‌న‌ను ఉదృతం చేస్తాము అంటూ బిజెపి మీడియా యూనిట్ అధిపతి విశ్వస్ పాథక్ అన్నారు.పోలీటికల్‌ డ్రామా వెబ్‌ సిరీస్‌ను దర్శకుడు‌ అలీ అబ్బాస్‌ రూపొందించగా, హిమాన్షు కిశన్‌ మెహ్రాతో కలిసి నిర్మించారు. ఇందులో డింపుల్‌ కపాడియా, సునీల్‌ గ్రోవర్‌, తిగ్మన్షు ధులియా, గౌహర్‌ ఖాన్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు.

VIDEOS

logo