Happy Birthday Prabhas | స్టార్ హీరో ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా (Happy Birthday Prabhas) ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు, దర్శక నిర్మాతలు ఆయన బర్త్‌డే విషెస్ తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. ప్రభాస్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఇక బాహుబలి అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో #HappyBirthdayPrabhas, #DarlingTurns46, #RebelStarDay వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రెండ్స్ సృష్టిస్తున్నారు. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నా సోదరుడు ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. జీవితమంతా నీపై విధేయతతో ఉంటాను. బాక్సాఫీస్ వద్ద నీ తుఫాను కొనసాగుతూనే ఉండాలి అంటూ హీరో మంచు విష్ణు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇటీవల విడుదలైన కన్నప్ప సినిమాలో వీరిద్దరూ కలిసి నటించిన విషయం తెలిసిందే.
Happy Birthday to my brother #Prabhas 🔥
You’ve always carried strength and grace, and my loyalty to you is for life.Wishing you more power, peace & thunder at the box office 💥 Love you ❤️ Har Har Mahadev #HappyBirthdayPrabhas
— Vishnu Manchu (@iVishnuManchu) October 23, 2025
రాజాసాబ్ హీరోయిన్ మాళవికా మోహనన్.. డార్లింగ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘హ్యాపీ బర్త్‌డే కింగ్.. రానున్న మీ సినిమాలన్నీ సూపర్‌హిట్ కావాలి. మీతో స్క్రీన్ పంచుకునే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మన ‘రాజాసాబ్’ విడుదల కోసం ఆసక్తిగా ఉన్నా’ అని ట్వీట్ చేసింది.
Happy Birthday Prabhas Sir!🎂🥳💕 Wishing you the most amazing year ahead & so excited to see all the amazing releases you have lined up in this coming year! ☺️#HappyBirthdayPrabhas
— Malavika Mohanan (@MalavikaM_) October 23, 2023
ఇండియన్ సినిమా రాజాసాబ్.. ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది మరో బ్లాక్‌బస్టర్ అందుకోవాలని కోరుకుంటున్నా అంటూ హీరో నారా రోహిత్ సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ చెప్పారు.
To the #Rajasaab of Indian Cinema, #Prabhas garu, wishing you a blockbuster year ahead. Happy Birthday! 🎉
#HappyBirthdayPrabhas pic.twitter.com/ZsWpx9o5jB— Rohith Nara (@IamRohithNara) October 22, 2025
వన్ అండ్ ఓన్లీ రెబల్ స్టార్ ప్రభాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు, తెర వెనుక మీ వినయం, తెరపై మీ అసమాన నటన లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి అంటూ హంబోలే ఫిలిమ్స్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది.
Wishing the One and Only Rebel Star, our dearest #Prabhas a very Happy Birthday!
Your humility off-screen, and your unmatched intensity on-screen, continue to inspire millions.
Here’s to creating more cinematic magic and unforgettable action-packed moments, together! 🌋… pic.twitter.com/d7G8jRB8o5— Hombale Films (@hombalefilms) October 22, 2025
Samantha | నా విడాకుల సమయంలో కొందరు సంబరాలు చేసుకున్నారు.. సమంత ఎమోషనల్ కామెంట్స్
Renu Desai | భాద్యత లేని తల్లిని కాదు.. సన్యాసం రూమర్స్‌పై రేణు దేశాయ్ క్లారిటీ