Renu Desai | తెలుగు సినీ ప్రేక్షకులకు సీనియర్ నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్యగా సుపరిచితమైన రేణు, బద్రి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. కెరీర్లో పెద్దగా సినిమాలు చేయని రేణూ పవన్ నుండి విడిపోయిన తర్వాత ఇద్దరు పిల్లల బాగోగులు చూసుకుంటూ జీవితం గడుపుతుంది. ఇటీవల టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రేణు సోషల్ మీడియా ద్వారా జంతు సంరక్షణ, సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను తరచుగా పంచుకుంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె సన్యాసం తీసుకునే ప్లాన్స్ గురించి మాట్లాడినట్లు కొన్ని మీడియా సైట్స్ ప్రచురించడంతో, అభిమానులు షాక్లో ఉన్నారు.
అయితే ఈ వార్తలు నెట్టింట వైరల్ కావడంతో రేణూ దేశాయ్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. నేను సరదాగా సన్యాసం తీసుకుంటానని చెప్పాను. నా పిల్లలు ఇంకా చిన్నవారే, వారిని వదిలి సన్యాసం తీసుకునే బాధ్యతలేని తల్లిని కాదు” అని ఆమె స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ “కెరీర్లో అన్ని చూశారు, నెక్స్ట్ ప్లాన్ ఏంటి?” అని అడిగినప్పుడు సరదాగా సన్యాసం తీసుకుంటానని చెప్పినట్టు రేణు తెలిపారు.
రేణు తన భక్తిని కొనసాగించడానికి ఇష్టపడుతున్నప్పటికీ, అది పిల్లల తరువాతనే అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు నా వయసు 45 మాత్రమే. 65 ఏళ్ళ తరువాతనే సన్యాసం తీసుకుంటాను” అని చెప్పి రూమర్స్కి క్లారిటీ ఇచ్చింది. మీడియా రూమర్స్ కొన్నిసార్లు చాలా ఇబ్బంది పెడతాయని, సమాజంలో ఉన్న వాస్తవ సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టాలని కోరారు. ఇలాంటి చిన్న వార్తలను హైలైట్ చేయరాదని సూచన కూడా చేశారు. ప్రస్తుతం రేణూ దేశాయ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. కాగా, విడాకుల తర్వాత రేణు దేశాయ్ సినిమాల నుంచి దూరమై, కాస్ట్యూమ్ డిజైనర్, నిర్మాత, దర్శకురాలిగా తన ప్రతిభను చూపించారు.ఇప్పుడు సినిమాల కన్నా ఆధ్యాత్మిక జీవన విధానంపై దృష్టి పెట్టారు.