Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందం, నటన, కష్టపడి పనిచేసే ధోరణితో స్టార్ హీరోయిన్లలో అగ్రస్థానంలో నిలిచిన ఈ బ్యూటీ ప్రొఫెషనల్ లైఫ్లో ఎంత సక్సెస్ సాధించిందో, పర్సనల్ లైఫ్లో మాత్రం అంతగా అదృష్టం కలసిరాలేదు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తోంది. కొంతకాలం ఆమె మయోసైటిస్ (Myositis) అనే అరుదైన వ్యాధితో బాధపడింది. ఆ సమస్య నుంచి కోలుకున్న సమంత మళ్లీ సినిమాలపై దృష్టి సారిస్తోంది.ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
సమంత మాట్లాడుతూ.. నా కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. నన్ను ద్వేషించే వాళ్లు నా దుస్థితిని చూసి నవ్వుకున్నారు. నాకు మయోసైటిస్ వచ్చినప్పుడు కూడా కొంతమంది ఎగతాళి చేశారు. ఇంకా నా విడాకుల సమయంలో వారు సంబరాలు చేసుకున్నారు. నా జీవితంపై వ్యాఖ్యానిస్తూ, నా భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకున్నట్టుగా మాట్లాడారు. అవన్నీ చూసి చాలా బాధపడ్డాను. కానీ తర్వాత నుంచి ఎవరి గురించి పట్టించుకోవడం మానేశాను అని సమంత ఎమోషనల్గా చెప్పింది.ఈ కామెంట్స్ నెట్లో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆమె ధైర్యం, బలమైన మనసుకు ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలామంది “సమంత నిజమైన ఫైటర్”, “ఆమెను కిందపడేయాలని చూసిన వాళ్లందరికీ ఇదే సమాధానం” అంటూ సపోర్ట్ చేస్తున్నారు.
ప్రస్తుతం సమంత బాలీవుడ్లో “రక్త్ బ్రహ్మాండ్” అనే సినిమాతో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకులు రాజ్ & డీకే తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇదిలా ఉండగా, సమంత త్వరలో తెలుగులో మరో సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఆ సినిమా పేరు “మా ఇంటి బంగారం”. ఈ చిత్రాన్ని దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో ముందుగా వచ్చిన “ బేబీ” సినిమా సూపర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. అందువల్ల “మా ఇంటి బంగారం”పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండగా, రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.