Legend Sridevi | దివంగత నటి సూపర్‌స్టార్ శ్రీదేవి జీవిత చరిత్ర పుస్తకంగా రానున్నది. ఆమె చనిపోయిన ఐదేండ్ల తర్వాత ఈ పుస్తకం విడుదల అవుతుండటంతో అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందా..? ఎప్పుడెప్పుడు చదివి ఆమె గురించిన మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా అన్న ఆసక్తితో అభిమానులు ఉన్నారు.
శ్రీదేవి జీవిత చరిత్ర పుస్తకం పేరు ‘శ్రీదేవి.. ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్’. ఈ పుస్తకాన్ని ఆమె భర్త బోని కపూర్ విడుదల చేయనున్నారు. త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రచురణకర్తలు కృతనిశ్చయంతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రముఖ కాలమిస్ట్, రచయిత, పరిశోధకుడు ధీరజ్ కుమార్ ఈ పుస్తకాన్ని రాశారు. శ్రీదేవి జీవిత చరిత్రను ఈ పుస్తకం ద్వారా ఆవిష్కరించనున్నారు. వెస్ట్‌ల్యాండ్ బుక్స్ సంస్థ దీనిపై సర్వ హక్కులు కలిగి ఉన్నది.
శ్రీదేవి బయోగ్రఫీపుస్తకాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు వెస్ట్‌ల్యాండ్ బుక్స్‌తో పాటు బోనీ కపూర్ కూడా విడివిడిగా ఇన్‌స్టాగ్రాంలో అధికారిక ప్రకటన చేశారు. పుస్తకం ముఖచిత్రాన్ని వెస్ట్‌ల్యాండ్ బుక్స్ పోస్ట్ చేసింది. ‘శ్రీదేవి జీవితం ఆధారంగా బయోగ్రఫిని ప్రచురిస్తున్నామని ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఆమె ఒక సుప్రసిద్ధ, నిజమైన సూపర్స్లార్’ అని రాసింది. 40 ఏండ్ల కెరీర్లో శ్రీదేవి దాదాపు 300 సినిమాల్లో నటించారు. 2013 లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. అలాగే, నేషనల్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు.