BB Telugu Grand finale | గత సీజన్లో మాదిరి ఈ సారి కూడా కంటెస్టెంట్స్‌ను బిగ్‌బాస్ బాగానే టెంప్ట్ చేశాడు. లక్షలకు లక్షలు ఆఫర్ చేసినా కూడా టాప్ 3 కంటెస్టెంట్స్ వాటి వైపు చూడలేదు. ముందు సిల్వర్ బాక్స్ తీసుకొని నాచురల్ స్టార్ నాని ఇంట్లోకి వచ్చాడు. అందులో కాస్త తక్కువ డబ్బు ఉంది. ఆ తర్వాత నాగ చైతన్య గోల్డెన్ బాక్స్ తీసుకొని ఇంట్లోకి వచ్చాడు. సిల్వర్ బాక్స్ కంటే మూడు రెట్లు ఎక్కువ డబ్బుతో ఆయన ఇంటి లోపలికి వెళ్లాడు. తనతో రావాలి అంటూ ఇంటి సభ్యులను కోరాడు. ఉత్తి చేతులతో ఇంటికి వెళ్లే బదులు డబ్బులు తీసుకొని తన వెంట రావాలి అంటూ ముగ్గురు ఇంటి సభ్యులను చివరి వరకు కోరుకున్నాడు.
అందులో 40 లక్షలు ఉన్నాయి. అయినా కూడా షణ్ముఖ్ జస్వంత్, సన్నీ, శ్రీరామచంద్ర ఆ డబ్బు వైపు చూడలేదు. ఏ ఒక్క కంటెస్టెంట్ కూడా కనీసం దాని గురించి ఆలోచించలేదు. గత సీజన్లో సోహెల్ మూడో స్థానంలో ఉండి డబ్బులు తీసుకొని బయటకు వచ్చాడు. అతడికి 25 లక్షలతో పాటు చిరంజీవి మరో 10 లక్షలు అదనంగా ఇచ్చాడు. అయితే ఈ సారి మాత్రం ముగ్గురు కంటెస్టెంట్స్ డబ్బు గురించి ఆలోచించలేదు. తమకు డబ్బు కంటే టైటిల్ ముఖ్యం అంటూ ముందడుగు వేశారు. మొత్తానికి గోల్డెన్ బాక్స్ అంటూ బిగ్‌బాస్ పెట్టిన టెంప్టేషన్ ఈ సీజన్ వర్కౌట్ కాలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
బిగ్‌బాస్ షో.. ఈ సీజన్లో అయినా అమ్మాయి గెలుస్తుంది అనుకుంటే..
బిగ్‌బాస్ విన్నర్ ఎవరు? హౌజ్‌మేట్స్ అనుకున్నది ఒకరిని.. అక్కడ జరుగుతున్నది మరొకటి..
Who is biggboss 5 Telugu winner | 105 రోజులు.. ఐదుగురు ఫైనలిస్టులు.. టైటిల్ విన్నర్ ఎవరు?
BB Telugu Grand Finale | అదిరిపోయే డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో మొదలైన బిగ్ బాస్ 5 ఫినాలే..
బిగ్ బాస్ స్టేజ్ మీద రాజమౌళి.. తన పేరు ముందున్న ‘ఎస్ఎస్’ అసలు రహస్యం చెప్పేసిన జక్కన్న
మంచు లక్ష్మీ చేతికి, కాళ్లకు గాయాలు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు