బిగ్ బాస్ తాజా ఎపిసోడ్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జట్టుగా ఉన్న సిరి, షణ్ముఖ్, జస్వంత్ మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇక కారాలు మిరియాలు నూరుకున్న ప్రియ, సన్నీ కలిసిపోయారు. సీక్రెట్ రూంలో ఉండి గేమ్‌ని పరిశీలించిన లోబో తిరిగి హౌజ్‌లోకి వచ్చేశాడు. ఇక ఇప్పుడు గేమ్ మరింత రసవత్తరంగా ఉంటుందని రవి చెప్పుకొచ్చాడు.
సీక్రెట్ టాస్కును సరిగ్గా అర్థం చేసుకోలేని జెస్సీ బొక్క బోర్లాపడ్డాడు. కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇంటిసభ్యులకు బిగ్‌బాస్ ‘బంగారు కోడిపెట్ట’ టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మానస్‌కి స్పైసీ నూడిల్స్ తిను అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో మానస్.. సన్నీతో పోటీ పడ్డాడు. సన్నీ విజేతగా నిలిచాడు.
కారం ఎక్కువగా ఉన్న నూడూల్స్ సన్నీ కొంచెం ఎక్కువగా తిని ఐదు గుడ్లను సొంతం చేసుకున్నాడు. ఇక బంగారు కోడిపెట్ట అనే టాస్కును బిగ్ బాస్ ముగించాడు. అందులో ఎక్కువగా గుడ్లు సంపాదించి మానస్, విశ్వ, సన్నీ, శ్రీరామచంద్ర, యాంకర్ రవిలు కెప్టెన్సీ పోటీలోకి వచ్చారు. జెస్సీను ముగ్గురి దగ్గర ఎగ్స్ జీరో చేయాలని చెప్పగా, ఆయన మాత్రం అందరి దగ్గర రిక్వెస్ట్ చేస్తూ వాటిని తీసుకున్నాడు. టాస్క్ ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోలేదని జెస్సీని కెప్టెన్సీ పోటీకి అనర్హుడిగా ప్రకటించాడు.