Peddi Movie | తెలంగాణలో ‘పెద్ది’ టికెట్ల పెంపు కష్టమే.. పిటిషన్ వెనక్కి తీసుకున్న మేకర్స్!
Peddi Movie | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' చిత్ర యూనిట్‌కు తెలంగాణలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
Peddi Movie | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ చిత్ర యూనిట్‌కు తెలంగాణలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జూన్ 4న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో, మొదటి వారం రోజులు టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, ఈ టికెట్ ధరల పెంపు వ్యవహారంలో ఎలాంటి జోక్యం చేసుకోలేమని, అత్యవసర ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సినిమా టికెట్ల రేట్లకు సంబంధించి గతంలో ఉన్న కోర్టు తీర్పులను, వివిధ కేసులను ప్రస్తావిస్తూ న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది
అంతకుముందు, టికెట్ ధరల పెంపునకు అనుమతించాలని కోరుతూ చిత్ర బృందం హోం సెక్రటరీకి రెండుసార్లు లేఖలు సమర్పించింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో వారు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు కూడా ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరిస్తూ తదుపరి విచారణను జూన్ 6కి వాయిదా వేయడంతో చిత్ర యూనిట్ వెనక్కి తగ్గింది. సినిమా జూన్ 4నే విడుదలవుతుండటంతో, ఆ తర్వాత విచారణ జరగడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని భావించిన మైత్రీ మూవీ మేకర్స్ తరపు న్యాయవాది తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. దీనితో హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ‘పెద్ది’ చిత్రానికి ప్రత్యేక ప్రదర్శనలతో పాటు టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు లభించినప్పటికీ, తెలంగాణలో మాత్రం పాత ధరలతోనే సినిమా ఆడాల్సి రావడంతో ట్రేడ్ వర్గాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

