Bhojpuri star Pawan Singh | వివాదాస్పద భోజ్‌పురి నటుడు పవన్ సింగ్‌కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ‘వై ప్లస్’ (Y+) కేటగిరీ భద్రతను కల్పించినట్లు తెలుస్తుంది. పవన్ సింగ్ ప్రాణాలకు ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా ఈ భద్రతను కల్పించినట్లు సమాచారం. ఈ కేటగిరీ కింద సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కు చెందిన సుమారు 8 నుంచి 11 మంది సాయుధ కమాండోలు అలాగే వ్యక్తిగత భద్రతా అధికారులు 24 గంటలు పవన్ సింగ్‌కు రక్షణగా ఉంటారు.
పవన్ సింగ్‌కు ఈ స్థాయిలో భద్రత కేటాయించడానికి ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని కొన్ని పరిణామాలు కారణమని తెలుస్తోంది. ఇటీవల భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో తిరిగి చేరిన పవన్ సింగ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటి కీలక నాయకులను కలవడం జరిగింది. అయితే వచ్చే బిహార్ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో పవన్ పోటీకి దిగబోతున్నట్లు సమాచారం.
కొన్ని మీడియా నివేదికల ప్రకారం ‘బాబా ఖాన్ గ్యాంగ్’ నుంచి పవన్ సింగ్‌కు బెదిరింపులు వచ్చినట్లు ఈ మేరకు కొన్ని బెదిరింపు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన మాజీ భార్య జ్యోతి సింగ్‌తో జరిగిన వివాదాలు, అలాగే ఇతర వ్యక్తిగత సమస్యలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ వివాదాల నేపథ్యంలో కూడా ఆయన భద్రతకు ముప్పు పొంచి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు సూచించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అతడి భద్రతకు ఎలాంటి లోపం లేకుండా ఉండేందుకు కేంద్ర హోం శాఖ పవన్ సింగ్‌కు వై ప్లస్ కేటగిరీ భద్రతను అందించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఒక హీరోయిన్ నడుము అనుచితంగా తాకి పవన్ సింగ్ ఇటీవల విమర్శలు ఎదుర్కోన్న విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం భాదిత నటి కూడా పవన్ సింగ్‌పై దుమ్మెత్తి పోయడమే కాకుండా జీవితంలో అతడి పక్కన నటించను అంటూ చెప్పుకోచ్చింది.