1960 దశకం ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్య కథాంశంతో రూపొందిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భోగి’. శర్వానంద్ కథానాయకుడిగా సంపత్‌నంది దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 28న ప్రేక్షకుల ముందుకురానుంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నది.
గురువారం ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో కందుల సులోచన రాణి అనే గ్రామీణ యువతి పాత్రలో ఆమె కనిపించనుంది. విస్తరాకులు విక్రయించి జీవనం సాగించే యువతిగా ఆమె పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని, ఈ క్యారెక్టర్ కోసం అనుపమ పరమేశ్వరన్ తెలంగాణ యాసలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుందని చిత్ర బృందం తెలిపింది. త్వరలో హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను మొదలుపెట్టబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కిషోర్ కుమార్ అరోకియా, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, రచన-దర్శకత్వం: సంపత్‌నంది.