BSS10 | యువ హీరోతో భీమ్లానాయక్ డైరెక్టర్ కొత్త సినిమా.. వివరాలివే
BSS10 | భీమ్లానాయక్ సినిమాతో మంచి బ్రేక్ అందుకున్నాడు యువ దర్శకుడు సాగర్ కే చంద్ర (Saagar K Chandra). యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas)తో సాగర్ కే చంద్ర సినిమా చేయబోతున్నాడంటూ ఇప్పటికే ఇండస్ట్రీ సర్కిల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
BSS10 | అయ్యారే సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అప్పట్లో ఒకడుండేవాడు, భీమ్లానాయక్ సినిమాలతో మంచి బ్రేక్ అందుకున్నాడు యువ దర్శకుడు సాగర్ కే చంద్ర (Saagar K Chandra). పవన్ కల్యాణ్ టైటిల్ రోల్లో నటించిన భీమ్లానాయక్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. సాగర్ కే చంద్ర ఈ సినిమా తర్వాత మళ్లీ కొత్త ప్రాజెక్ట్ ఏమీ ప్రకటించలేదు. యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas)తో సాగర్ కే చంద్ర సినిమా చేయబోతున్నాడంటూ ఇప్పటికే ఇండస్ట్రీ సర్కిల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఇప్పుడిదే కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్ 10వ సినిమాగా వస్తున్న BSS10 ప్రాజెక్ట్‌ను ఇవాళ ప్రకటించారు మేకర్స్. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామనవమి శుభాకాంక్షలతో టాలెంటెడ్ దర్శకుడు సాగర్ కే చంద్ర డైరెక్షన్లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ అని రామ్ ఆచంట అనౌన్స్మెంట్ పోస్టర్‌ను అందరితో పంచుకున్నాడు.
ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారు.. ఇతర నటీనటులెవరనే దానిపై రాబోయే రోజుల్లో క్లారిటీ ఇవ్వనుంది టీం. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం వివి వినాయక్ డైరెక్షన్లో చత్రపతి హిందీ రీమేక్‌లో నటిస్తున్నాడు. బాలీవుడ్ నటి నుస్రత్ బరూచా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీ టీజర్ దసరా స్క్రీనింగ్ అవుతున్న థియేటరల్లో ఇప్పటికే సందడి చేస్తోంది.
Sri Rama Navami Subhakankshalatho ,announcing our next..An action entertainer directed by highly talented #SaagarKChandra with @BSaiSreenivas !!#BSS10 pic.twitter.com/2Ey5OJG9Mn
— ram achanta (@RaamAchanta) March 30, 2023
Read also :
Dasara | దసరా కలెక్షన్లు.. యూఎస్ బాక్సాఫీస్ వద్ద నాని మేనియా..!
Chatrapathi Teaser | స్టన్నింగ్‌గా బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

