మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దసరా (Dasara) మూవీ థియేటర్లలోకి రానే వచ్చింది. చాలా రోజుల తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో నాని (Nani) పక్కా మాస్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. తాజాగా యూఎస్ఏ కలెక్షన్లకు సంబంధించిన వార్త ఒకటి దసరా ఎలా ఉందో చెప్పేస్తుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం దసరా యూఎస్ బాక్సాఫీస్ వద్ద 500K డాలర్ల (రూ.4,10,96,750)కుపైగా వసూళ్లు రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. యూఎస్ఏ నానికి మార్కెట్పరంగా ఎప్పుడూ స్ట్రాంగ్ జోన్‌గా ఉంటుంది. దసరా మరోసారి ఇదే విషయాన్ని రుజువు చేస్తోంది. మొత్తానికి ఓపెనింగ్ రోజే కలెక్షన్ల విషయంలో తగ్గేదేలే అంటోన్న నాని లాంగ్ రన్లో ఎలాంటి వసూళ్లు రాబడతాడనేది వేచి చూడాలంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఈ చిత్రంలో కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. సాయికుమార్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, సముద్రఖని, జరీనా వహబ్, కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజిషన్‌లో విడుదలైన పాటలను మ్యూజిక్ లవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. దసరా ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.
Nani