Akhanda 2 | టాలీవుడ్ హిట్ కాంబినేషన్స్‌లో టాప్‌లో ఉంటారు బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శీను (Boyapati srinu). ఈ ఇద్దరి కలయికలో వస్తోన్న సీక్వెల్ ప్రాజెక్ట్ అఖండ 2 (Akhanda 2). తెలుగుతోపాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఎస్ థమన్ అండ్ బాలయ్య టీం మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేసింది.
తాజాగా మేకర్స్ అఖండ 2 సెకండ్ సింగిల్ జాజికాయ జాజికాయను నవంబర్ 18న లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించారు. వైజాగ్‌లోని జగదాంబ థియేటర్లో సాయంత్రం 5 గంటల నుంచి సాంగ్ లాంచ్ ఈవెంట్ జరుగనుంది. ఈ పాటలో భీమ్లానాయక్ ఫేం సంయుక్తామీనన్ బాలకృష్ణతో కలిసి డ్యాన్స్ చేయనుంది. ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలిచిపోయేలా కలర్ఫుల్గా ఉండబోతున్నట్టు సాంగ్ లుక్ పోస్టర్ క్లారిటీ ఇచ్చేస్తుంది.
ఇప్పటికే లాంచ్ చేసిన అఖండ 2 టీజర్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఇక సీక్వెల్లో ఫస్ట్ పార్టుకు మించిన స్కోర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉండబోతుందని ఇప్పటివరకు థమన్ షేర్ చేసిన అప్డేట్స్ చెబుతున్నాయి. అఖండ 2ను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
#Akhanda2 second single #JajikayaJajikaya out on November 18th ❤🔥
Grand launch event at Jagadamba Theatre, Vizag from 5 PM onwards 💥💥#Akhanda2 IN CINEMAS WORLDWIDE FROM DECEMBER 5th.#Akhanda2Thaandavam
‘GOD OF MASSES’ #NandamuriBalakrishna #BoyapatiSreenu @AadhiOfficial… pic.twitter.com/7ULRbJ9w0D— BA Raju’s Team (@baraju_SuperHit) November 17, 2025
IFFI | సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి.. రజినీకాంత్, బాలకృష్ణకు అరుదైన గౌరవం
Manchu Lakshmi | మంచు లక్ష్మీ నో ఫిల్టర్ కామెంట్స్ వైరల్ .. సినీ పరిశ్రమ, సమాజంపై బాంబుల వర్షం