సూర్యతేజ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘భరతనాట్యం’. ‘సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటీఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్’ ఉపశీర్షిక. ‘దొరసాని’ ఫేమ్ కేవీ మహేంద్ర దర్శకుడు. పీఆర్ ఫిల్మ్స్ పతాకంపై పాయల్ సరాఫ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీనాక్షీ గోస్వామి కథానాయిక. శనివారం చిత్ర టీజర్‌ను ఆవిష్కరించారు. యంగ్ ఫిల్మ్‌మేకర్‌గా హీరో సూర్యతేజ పడుతున్న కష్టాలను చూపిస్తూ టీజర్ ఆరంభమైంది. ఆ తర్వాత ‘భరతనాట్యం’ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. దర్శకుడు మాట్లాడుతూ ‘క్రైమ్ కామెడీ జోనర్లో ఓ కొత్త ఎలిమెంట్‌ను పరిచయం చేస్తూ ఈ సినిమాను రూపొందించాం.
ఎంటర్టైన్మెంట్ కొత్త పంథాలో ఉంటుంది. ప్రతీ పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. సాంకేతికంగా కూడా ఉన్నతంగా కనిపిస్తుంది’ అన్నారు. ‘వినూత్నమైన కథతో హీరోగా పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించే చిత్రమవుతుంది’ అని హీరో సూర్యతేజ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ ఆర్ శాఖమూరి, సంగీతం: వివేక్ సాగర్, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: సూర్య తేజ ఏలే, కేవీఆర్ మహేంద్ర, కథ: సూర్యతేజ, దర్శకత్వం: కేవీఆర్ మహేంద్ర.