‘భరతనాట్యం’ కథకు లాజిక్కులతో పనిలేదు. వినోదం పంచే అన్ని ఎలిమెంట్సూ ఇందులో కుదిరాయి. ఇది హీరోహీరోయిన్ల కథలా ఉండదు. ఈ సినిమా ప్రేరణగా భవిష్యత్తులో కొత్త తరహా పాత్రలు రాయబడతాయి’ అంటున్నారు దర్శకుడు కేవీఆర్ మహేంద్ర. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భరతనాట్యం’. సూర్యతేజ ఏలే, మీనాక్షి గోస్వామి జంటగా నటించారు.
పాయల్ సరాఫ్ నిర్మాత. ఈ నెల 5న సినిమా విడుదల కానుంది. దర్శకుడు కేవీఆర్ మహేంద్ర విలేకరులతో ముచ్చటించారు. ‘దాదాపుగా ఇరవై నెలలు కష్టపడిస్క్రిప్ట్ తయారుచేశాం. కొత్తవారితో చేసిన సినిమాలా ఉండదు. హిలేరియస్ డార్క్ కామెడీని ప్రేక్షకులు అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పారు మహేంద్ర. ఇంకా చెబుతూ ‘భరతనాట్యం ఒక నృత్యకళ. కానీ ఆ పేరుని ఇక్కడ క్రైమ్ వరల్డ్‌కి పెట్టాం. దానికి బలమైన కారణం ఉంది. సాంకేతికంగా అన్ని విధాల సినిమా బావుంటుంది’ అని దర్శకుడు తెలిపారు.