Bhanumathi Ramakrishna | పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించే నటీమణుల్లో అగ్ర జాబితాలో వుంటారు స్వర్గీయ భానుమతి. ఆమె పోషించే పాత్రలో హుందాతన, ఠీవీ వేరే లెవల్లో వుంటుంది. నిజం చెప్పాలంటే భానుమతి గారు నటించిన సినిమాలు కేవల ఆమె వల్లే విజయవంతం అయ్యేవి అంటే అతిశయోక్తి కాదు.
బహుముఖప్రజ్క్షాశాలియైన ఈ మహానటి కేవల నటిగానే కాదు గాయనిగా, రచయిత్రిగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా తన ప్రతిభను చూపేవారు. అయితే పాత్రల్లో ఎంతో ధైర్యవంతురాలిగా కనిపించే ఆమె చిన్న చిన్ని విషయాల్లో భయపడేవారని ఆమెకు, వారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ప్రముఖ రచయిత డీవీ నరసరాజు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
ఆయన చెబుతూ ‘ఆమె పాత్రలు, గాంభీర్యం చూసి భానుమంతి ఎంతో ధైర్యవంతురాలు అని అందరూ అనుకుంటాం. కానీ ఆమెలో ఉన్న ప్రత్యేకతలు, చిన్న చిన్న వీక్నెస్లు నేను సన్నిహితుడిని కాబట్టి నాకు తెలుసు. ఆమెకు బల్లి అంటే చచ్చే భయం. కానీ ఆమె సినిమాల్లో చేసే పాత్రలు, రచయితగా ఆమె ధైర్యవంతమైన కథలు చూసే వారు ఇది అబద్దం అనుకుంటారు. కానీ ఇది నిజం. ఒక రోజు హాలులో కూర్చొని నేను, ఆమె, రామకృష్ణలు మాట్లాడుకుంటున్నాం. ఆమెకు ఎదురుగా వున్న గోడ మీద బల్లి కనబడింది. అంతే కెవ్వుమని కేక వేసి ఎగిరి గంతేసి పక్క గదిలోకి పారిపోయింది. పనివాళ్లు గట్టిగా పిలిచి, అంతను ఆ బల్లిని బయటకు పంపించే దాకా, ఆమె తిరిగి ఆ రూమ్‌లోకి రాలేదు. ఇక నేను రామకృష్ణ గారు ఆమె పరిస్థితిని చూసి చాలా సేపు నవ్వుకున్నాం. ఆమె మాత్రం కాసేపటి వరకు మనిషి మనిషిగా లేదు . అంతలా భయపడిపోయింది’ అని చెప్పుకొచ్చారు. అయితే డీవీ నరసరాజు గారు భానుమతి గారికి ఇష్టమైన రచయితల్లో ఒకరు. వీరితో పాటు పెరల్.ఎస్.బక్ రచనలను కూడా ఆమె ఎంతో ఇష్టపడతారు.
Also read..