Bhairavam | ఉగ్రం ఫేం విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ భైరవం (Bhairavam). బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas), నారా రోహిత్ (Nara Rohith), మంచు మనోజ్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. అదితీశంకర్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. భైరవం నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. తాజాగా టీజర్ అప్డేట్ పోస్టర్ వదిలారు.
భైరవం టీజర్‌ను జనవరి 20న అమీర్‌పేట్‌లోని ఏఏఏ సినిమాస్‌లో లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటిస్తూ.. కొత్త లుక్ విడుదల చేశారు. మనోజ్, బెల్లంకొండ, నారా రోహిత్ ఒకే ఫార్మాట్లో సీరియస్ లుక్‌లో కనిపిస్తూ టీజర్‌పై అంచనాలు అమాంతం పెంచేస్తున్నారు. ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈ చిత్రంలో మనోజ్ గజపతిగా కనిపించనుండగా.. నారా రోహిత్ వరద పాత్రలో కనిపించబోతున్నాడు.
థ్రిల్లింగ్ యాక్షన్ ప్యాక్డ్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న భైరవంలో మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ పాత్రలు మాస్ అప్పీల్‌తో ఉండబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన లుక్స్, తాజా పోస్టర్ క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. ఈ మూవీని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా.. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
భైరవం టీజర్ లుక్..
The adrenaline pumping #BhairavamTeaser out on 20th January 💥💥#Bhairavam Grand teaser launch event at AAA Cinemas, Ameerpet on 20th Jan from 2.30 PM onwards ❤🔥
Book Your Passes Now 🎫https://t.co/gch3OFUIUu pic.twitter.com/Gv8WWwe1xa
— BA Raju’s Team (@baraju_SuperHit) January 19, 2025
Thalapathy 70 | దళపతి 70కు ప్లాన్.. విజయ్ ఏంటీ పవన్ కల్యాణ్ రూటులోనే వెళ్తున్నాడా..?