‘భైరవం’ చిత్రానికి అన్ని కేంద్రాల్లో అద్భుతమైన ఆదరణ లభిస్తున్నది. ఇది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా. మా ముగ్గురి పాత్రల్లోని కొత్తదనం ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నది’ అన్నారు చిత్ర హీరోలు బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్. ఈ ముగ్గురు ప్రధాన పాత్రల్లో విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ‘భైరవం’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. కె.కె.రాధామోహన్ నిర్మాత. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ ‘ఇది నా కెరీర్లోనే మోస్ట్ మెమరబుల్ మూవీ.
పర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న ఇలాంటి పాత్ర రావడం అదృష్టంగా భావిస్తున్నా’ అన్నారు. తొమ్మిదేళ్ల తర్వాత సినిమా చేశానని, ప్రేక్షకులు గొప్పగా ఆదరించారని మంచు మనోజ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది టీం అందరి విజయమని నారా రోహిత్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయం చూస్తుంటే తదుపరి చిత్రాన్ని ఐదుగురు హీరోలతో చేయాలనే ఉత్సాహం కలుగుతున్నదని, ‘భైరవం’ తమ అంచనాలన్నింటిని నిజం చేసిందని నిర్మాత కె.కె.రాధామోహన్ పేర్కొన్నారు.