సినిమా విడుదలకు ముందే స్టార్ స్టేటస్‌ని సొంతం చేసుకున్నది భాగ్యశ్రీ బోర్సే. ప్రస్తుతం ఈ అందాలభామ డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కట్టారనేది ఫిల్మ్‌వర్గాల టాక్. రవితేజ హీరోగా హరీశ్‌శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘మిస్టర్ బచ్చన్’ ద్వారా ఈ ముద్దుగుమ్మ కథానాయికగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 15న సినిమా విడుదల కానుంది. అందుకే మిగిలివున్న వర్క్‌ని చకచకా పూర్తి చేస్తున్నారు చిత్రబృందం.
తాజాగా భాగ్యశ్రీ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పేసుకొని తన బాధ్యతను పూర్తి చేసేసుకుంది. తన మాతృభాష తెలుగు కాకపోయినా కష్టపడి నేర్చుకొని తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పడంతో అందరూ భాగ్యశ్రీని అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఆమె డెడికేషన్ని ప్రశంసిస్తున్నారు. ఇప్పటివరకూ విడుదలైన ప్రచారచిత్రాల్లో భాగ్యశ్రీ బోర్సే స్క్రీన్ ప్రెజెన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిందని, ఎక్కడ చూసినా ఆమె ఫొటోలే వైరల్ అవుతున్నాయని, విడుదలకు ముందే టాలీవుడ్ అప్ కమింగ్ క్రేజీ హీరోయిన్ అంటూ ఆమెను కొనియాడుతున్నారని మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.