Bhagyashri Borse | మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది భాగ్యశ్రీ బోర్సే. ఇటీవలే ఆంధ్ర కింగ్ తాలూకా, కాంతా సినిమాలలో కూడా మెరిసింది. కెరీర్లో అతితక్కువ సమయంలోనే క్రేజీ ఆఫర్ కొట్టేసింది. తాజా టాక్ ప్రకారం భాగ్యశ్రీ బోర్సే ఫీ మేల్ సెంట్రిక్ సినిమాను లైన్లో పెట్టిందట. అంతేకాదు వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ స్వప్నాదత్, ప్రియాంకా దత్ స్వప్నా సినిమా బ్యానర్‌పై ప్రతిష్టాత్మక సినిమాను తెరకెక్కిస్తున్నారు.
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది ఈ బ్యానర్. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. పవర్ ఫుల్ ఉమెన్ సెంట్రిక్ సబ్జెక్టుతో స్క్రిప్ట్ రెడీ చేశాడట రమేశ్. ఇప్పటిదాకా గ్లామరస్ రోల్స్ లో మెరిసిన భాగ్యశ్రీని ఇక నటనకు ఆస్కారమున్న పాత్రలో చూపించబోతున్నాడట డైరెక్టర్.
మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజీనగర్కు చెందిన ఈ భామ హిందీ ప్రాజెక్టులు యారియాన్, చందూ చాంపియన్‌లో కామియో రోల్స్ లో నటించింది. మిస్టర్ బచ్చన్ సినిమాకు గాను బెస్ట్ ఫీ మేల్ డెబ్యూ ఫర్ తెలుగు అవార్డు అందుకుంది. మరి తాజాగా చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా భాగ్యశ్రీలోని నయా యాంగిల్‌ను చూపించడం ఖాయమైనట్టేనని ఈ వార్త క్లారిటీ ఇచ్చేస్తుది. మరి భాగ్యశ్రీ ఎలాంటి కథాంశంతో ప్రేక్షకుల ముందుకొస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Ustaad Bhagat Singh | ఉస్తాద్భగత్ సింగ్‌తో హరీష్ శంకర్ సెల్ఫీ.. ట్రెండింగ్‌లో స్టిల్స్