సినిమాల్లో అనవసరమైన శృంగార సన్నివేశాలపై పునరాలోచించుకోవాలని అంటున్నది అలనాటి అందాల తార భాగ్యశ్రీ. హీరోయిన్లను బోల్డ్‌గా చూపించడంలో తప్పులేదనీ, అసహ్యంగా మాత్రం చూపించకూడదని అభిప్రాయపడింది. తాజాగా, ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్నది భాగ్యశ్రీ. ఈ సందర్భంగా 90లతో పోలిస్తే.. ప్రస్తుత సినిమాలకు ఉన్న తేడాల గురించి మాట్లాడింది. “ఏ కాలంలోనైనా సినిమా అనేది అప్పటి సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. 90లలో జనాలకు వినోదం కావాలంటే.. వారికి ఉన్న ఏకైక మార్గం సినిమానే. కుటుంబంతో సమయం గడపాలన్నా, నలుగురు కలిసి కాలక్షేపం చేయాలన్నా థియేటర్లకే వెళ్లేవారు. అందుకే, కుటుంబ నేపథ్యంలో సాగే సినిమాలే ఆ కాలంలో ఎక్కువగా తెరకెక్కేవి.
ఇప్పుడు కాలంతోపాటు సినిమా తీసే విధానం కూడా మారింది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వినోదం కోసం ఎన్నో మాధ్యమాలు వచ్చాయనీ, దాంతో జనాలకు ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయని అంటున్నది. ఈ క్రమంలో ప్రేక్షకులను మెప్పించడానికి సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలను బలవంతంగా జొప్పిస్తున్నారని అభిప్రాయపడింది. దాంతో, పిల్లలు, తల్లిదండ్రులు కలిసి కూర్చుని సినిమాలు చూడలేని పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేసింది. “ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే రొమాన్స్ ఎందుకు? అవసరంలేని శృంగార సన్నివేశాలు ఎందుకు?” అని ప్రశ్నించింది. కథలను బోల్డ్‌గా చెప్పొచ్చనీ, మరీ అసహ్యంగా చూపించడం తగదని ఘాటుగా వ్యాఖ్యానించింది. 1989లో వచ్చిన ‘మైనే ప్యార్ కియా’తో తెరంగేట్రం చేసింది భాగ్యశ్రీ.
ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో.. రాత్రికి రాత్రే స్టార్హీరోయిన్గా మారిపోయింది. మొదటి సినిమాతోనే దేశం మొత్తాన్నీ తనవైపు తిప్పుకొన్నది. అంతలోనే అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. చిన్ననాటి స్నేహితుడు, నటుడు, నిర్మాత హిమాలయన్ దస్సానితో పెళ్లిపీటలెక్కింది. అయితే, పెళ్లి తర్వాత కూడా నటనను కొనసాగిస్తూ.. బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎదిగింది. ‘పాయల్’, ‘ఘర్ ఆయా మేరా పర్దేసి’, ‘ఓంకారం’ వంటి చిత్రాలలో నటించింది. ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. రీ-ఎంట్రీలోనూ పలు హిట్ చిత్రాలలో కీలక పాత్రలు పోషించింది. ప్రభాస్ హీరోగా వచ్చిన ‘రాధే శ్యామ్’లో తల్లి క్యారెక్టర్ చేసింది. తాజాగా, రితేష్ దేశ్‌ముఖ్ సినిమా ‘రాజా శివాజీ’లోనూ భాగ్యశ్రీ కీలకపాత్ర పోషిస్తున్నది.
వర్టికల్ డీటైయిలింగ్ ఉండే దుస్తుల్ని ఎంచుకుంటే.. ఎత్తు తక్కువ ఉన్నవాళ్లు కూడా పొడవుగా కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటివారు బటన్ షర్ట్స్, నిలువు గీతలు, చారలు ఉండే డ్రెస్సులు ధరించాలని సూచిస్తున్నారు. ఇవి వ్యక్తులను పొడుగ్గా కనిపించేలా చేస్తాయట. ఇక ప్యాంట్లు, బాటమ్స్‌ను పాదాలు, చీలమండలకు పైన ఉండేలా ధరించాలట. వీటివల్ల షూపైన క్లీన్లైన్ వస్తుంది. దీంతో వారు పొడుగ్గా కనిపిస్తారు. పొడువు ఎక్కువగా ఉన్న ప్యాంట్లు వేసుకుంటే.. పొట్టిగా కనిపించేలా చేస్తాయట.