Rana Daggubati | బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. వివరణ ఇచ్చిన రాణా దగ్గుబాటి టీమ్..
Rana Daggubati | ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కేసు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఓ యువకుడి ఫిర్యాదుతో బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న ప్రముఖులపై చర్యలకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురిపై కేసులు నమోదయ్యాయి. నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తున్నారు.
Rana Daggubati | ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కేసు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఓ యువకుడి ఫిర్యాదుతో బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న ప్రముఖులపై చర్యలకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురిపై కేసులు నమోదయ్యాయి. నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తున్నారు. తాజాగా గురువారం టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులపై సైతం కేసు నమోదైంది. దాంతో ఇప్పటికే పలువురు దిగివచ్చి వివరణ ఇచ్చారు. ఇందులో రాణా దగ్గుబాటి పేరు సైతం ఉన్నది. బెట్టింగ్ యాప్ వ్యవహారంపై ఆయన పీఆర్ టీమ్ వివరణ ఇచ్చింది. స్కిల్ బేస్డ్ గేమ్ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు రాణా దగ్గుబాటు ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని.. గడువు 2017లో ముగిసిందని పేర్కొన్నారు. ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు చట్టబద్ధంగా అనుమతి ఉన్న వాటికి మాత్రమే ఆమోదం తెలిపారని టీమ్ పేర్కొంది.
ఒప్పందాలు చేసుకునే ముందు రాణా లీగల్ టీమ్ అన్ని భాగస్వామ్యాలను క్షుణ్ణంగా సమీక్షిస్తుందని.. చట్టపరమైన సమీక్ష తర్వాతే.. చట్టానికి పూర్తిగా అనుగుణంగా ఉండేలా ప్లాట్‌ఫామ్‌ను మాత్రమే అంగీకరించారని పీఆర్ టీమ్ పేర్కొంది. చట్టబద్ధంగా ఉన్న వాటికి మాత్రమే అంబాసిడర్‌గా చేశారని నిర్ధారించేందుకు ఈ ప్రకటన జారీ చేసున్నట్లు పేర్కొంది. గ్యాంబ్లింగ్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు గుర్తించిన ఈ ఆన్లైన్ గేమ్‌లను హైలెట్ చేయడం చాలా అవసరమని.. ఈ గేమ్‌లో అదృష్టంపై కాకుండా నైపుణ్యంపైనే ఆధారపడి ఉన్నాయని.. అందువల్ల చట్టబద్ధంగా అనుమతి ఇస్తున్నట్లు కోర్టు తీర్పు ఇచ్చిందని రాణా టీమ్ వివరణ ఇచ్చింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో మియాపూర్ పీఎస్ పరిధిలో 25 మందిపై కేసులు నమోదయ్యాయి. విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, రాణాతో పలువురు ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే విజయ్ దేవరకొండ టీమ్‌తో పాటు నటుడు ప్రకాశ్‌రాజ్ సైతం వివరణ ఇచ్చారు.
Official Statement from #RanaDaggubati‘s PR Team about #BettingApps Controversy
We would like to clarify that Rana Daggubati had an agreement with a company to promote a skill-based gaming platform. This contract ended in 2017.
His endorsement was strictly for regions where… pic.twitter.com/Lf7axXzSSu
— KLAPBOARD (@klapboardpost) March 20, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

