Kishkindhapuri | ఈ ఏడాది భైరవం సినిమాతో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో ఆడియెన్స్‌ను పలుకరించాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ యాక్టర్ నటిస్తోన్న ఫాంటసీ హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి (Kishkindhapuri). కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్‌ను నెట్టింట హల్ చల్ చస్తోంది.
కాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ మూవీని ఒక రోజు ఆలస్యంగా అంటే సెప్టెంబర్ 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది టీం. హార్రర్ కల్చర్‌లో మిస్టరీ, డేంజర్, ఫియర్ లాంటి అంశాలు తరచూ 13వ నంబర్‌తో లింక్ అయి ఉంటాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ తీసుకున్న స్ట్రాటజీ కిష్కింధపురి సినిమాకు కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
హారర్ కల్చర్‌లో 13 కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు.. ఇది ఒక మిస్టరీ, డేంజర్, గుర్తు తెలియని భయం. అందుకే కిష్కింధపురి ఆగమనానికి ఇదే తేదీన వస్తోంది.. అంటూ షేర్ చేసిన నయా లుక్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది.
తేజ సజ్జా మిరాయి సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బెల్లంకొండ తీసుకున్న తాజా నిర్ణయంతో మిరాయి సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే పోటీ ఉండకపోవడం కూడా సినిమాకు ప్లస్ అవుతుందంటున్నారు సినీ జనాలు. మంత్రాలతో మూసివేయబడిన ఒక పాత మహల్లోకి హీరో తన అనుచరులతో కలిసి వెళ్లిన అనంతరం ఆ మహల్లో ఏం జరిగిందనే నేపథ్యంలో సినిమా ఉండబోతుందని కిష్కింధపురి గ్లింప్స్‌తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్ కౌశిక్.
In horror culture, 13 is never just a number… It is mystery, danger, and unknown fear 🥶
And that is the reason #Kishkindhapuri chooses it as the day of its arrival.#KISHKINDHAPURI GRAND RELEASE WORLDWIDE on September 13th, 2025 💥💥#KishkindhapuriTrailer update today at… pic.twitter.com/2zFiXaVI3w
— Shine Screens (@Shine_Screens) September 1, 2025
Vada Chennai 2 | వడ చెన్నై 2 వచ్చేస్తుంది.. క్రేజీ సీక్వెల్‌పై వెట్రిమారన్ ఏమన్నాడంటే..?
Game Changer Editor | డైరెక్టర్‌గా గేమ్ ఛేంజర్ ఎడిటర్.. స్టార్ హీరో సినిమాతో గ్రాండ్ ఎంట్రీ..!