‘నేను ఇప్పటివరకు మాస్, కమర్షియల్ సినిమాలే చేశాను. కానీ స్వతహాగా నాకు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ అంటే ఇష్టం. హారర్తో పాటు మిస్టరీ కలబోసిన సినిమా ఇది. హారర్ మూవీలో ఈ స్థాయి కథ కుదరడం అరుదైన విషయం’ అన్నారు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ఆయన కథానాయకుడిగా కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో రూపొందిన ‘కిష్కింధపురి’ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలు..