Kishkindhapuri | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ఫాంటసీ హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి (Kishkindhapuri). కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. కాగా మరోవైపు డిజిటల్ ప్లాట్‌ఫాంలో తన లక్‌ను పరీక్షించుకునేందుకు ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది.
ఈ మూవీ మరోవైపు టెలివిజన్‌లో కూడా ప్రీమియర్ కానుంది. కిష్కింధపురి అక్టోబర్ 19 (ఆదివారం)న సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్ కానున్నట్టు జీ తెలుగు ప్రకటించింది. కిష్కింధపురి ప్రస్తుతం వన్ ఆఫ్ ది లీడింగ్ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఓటీటీలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే టీవీ ప్రీమియర్ అప్డేట్ కూడా అందించి సినిమా చూడని మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్ అందించారు మేకర్స్. మరి కిష్కింధపురి టీవీలో ఎలాంటి టీఆర్పీ రేటింగ్ నమోదు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
కిష్కింధపురి మూవీలో సాండీ మాస్టర్, హైపర్ ఆది, ప్రేమ, తనికెళ్లభరణి ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
భయం మొదలైన చోటు… సువర్ణ రేడియో స్టేషన్… మీ రాక కోసం ఎదురు చూస్తుంది 🔥💀
Watch #Kishkindhapuri Tomorrow at 6PM On #ZeeTelugu #WorldTelevisionPremiere#ZeeTeluguPromo@BSaiSreenivas @anupamahere @Koushik_psk @sahugarapati7 @chaitanmusic pic.twitter.com/O7YkG1hEau
— ZEE TELUGU (@ZeeTVTelugu) October 18, 2025