న్యూఢిల్లీ, జూన్ 1 : గడిచిన నెలలో రూ.1.94 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కిందటేడాది ఇదే నెలలో వసూలైన రూ.1.88 లక్షల కోట్లతో పోలిస్తే 3.2 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. వస్తువులు, సేవలతోపాటు దిగుమతులు ద్వారా వచ్చే జీఎస్టీ వసూళ్లు అంతకంతకు పెరుగడం వల్లనే గత నెలలో అత్యధికంగా వసూలైనట్టు పేర్కొంది.
దీంట్లో సీజీఎస్టీ కింద రూ.37,397 కోట్లు వసూలవగా, స్టేట్ జీఎస్టీ కింద రూ.45,143 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.51,990 కోట్లు వసూలయ్యాయి. పన్ను విధించబడిన వస్తువులపై విధించిన పన్ను వసూళ్లు 26.9 శాతం వృద్ధి నమోదు చేసుకోగా, సర్వీసెస్ రంగం 22.2 శాతం వృద్ధి కనబరిచింది. అలాగే ఐజీఎస్టీ వసూళ్లు 19.1 శాతం అందుకొని రూ. 59,654 కోట్లకు చేరుకున్నాయి.