Bellamkonda Ganesh | నిర్మాత బెల్లంకొండ సురేశ్ మొదటి తనయుడు సాయి శ్రీనివాస్ ఇప్పటికే హీరోగా తన మార్క్ చూపించాడు. అల్లుడు శీను చిత్రంతో తెరంగేట్రం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్.. పలు చిత్రాలతో సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెడుతున్నాడు. ఛత్రపతి హిందీ రీమేక్‌తో అక్కడ లక్ పరీక్షించుకునేందుకు సిద్దమయ్యాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు బెల్లంకొండ రెండో తనయుడు గణేశ్ కూడా హీరోగా రంగప్రవేశం చేస్తున్నాడు.
ఒకేసారి రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు బెల్లంకొండ గణేశ్. ప్రస్తుతం ఈయన నటిస్తున్న స్వాతిముత్యం, నేను స్టూడెంట్ సార్ రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఈ రోజు ( బుధవారం ) బెల్లంకొండ గణేశ్ పుట్టిన రోజు సందర్భంగా స్వాతిముత్యం సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ చూసి ఈయన నటన గురించి కామెంట్ చేయలేం. ఎందుకంటే టీజర్లో రెండు డైలాగులు, రెండు ఎక్స్‌ప్రెషన్స్‌తో కనిపించాడు. అయితే చూడ్డానికి మాత్రం క్యూట్‌గా ఉన్న ఈ యువ హీరో.. అన్నయ్యలా మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తాడో.. లేక లవర్‌బాయ్ ఇమేజ్‌తో కొనసాగుతాడో వేచి చూడాలి. దానికంటే ముందు హీరోగా ఈ స్వాతిముత్యం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో తెలియాలంటే ఈ టీజర్ సరిపోదు.. సినిమా విడుదల కావాల్సిందే.
Bellamkonda ganesh | అప్పుడే రెండో సినిమాను ప్రకటించిన బెల్లంకొండ హీరో”