e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home News బీస్ట్ నుండి మ‌రో స‌ర్‌ప్రైజ్

బీస్ట్ నుండి మ‌రో స‌ర్‌ప్రైజ్

బీస్ట్ నుండి మ‌రో స‌ర్‌ప్రైజ్

దళపతి విజయ్ సినిమాలు తెలుగులో కూడా ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. ఆయన సినిమాలు ఇక్కడ కూడా అదిరిపోయే వసూళ్లు తీసుకొస్తున్నాయి. కొన్నేళ్లుగా సినిమా సినిమాతో తన మార్కెట్ రేంజ్ పెంచుకుంటున్నాడు విజయ్. అంతేకాకుండా ఈయన కథల ఎంపిక కూడా అంతే విభిన్నంగా ఉంది. రొటీన్ మాస్ సినిమాలు కాకుండా కాస్త డిఫరెంట్ గా ఉంటూనే కమర్షియల్ అంశాలు ఉన్న కథలనే ఎంచుకుంటున్నారు విజయ్. అందుకే తెలుగులో కూడా ఈయన సినిమాలు విజయం సాధిస్తున్నాయి. మొన్న మాస్టర్ సినిమాతో తన రేంజ్ తెలుగులో 12 కోట్లకు పెంచుకున్నాడు విజయ్. ఇదిలా ఉంటే జూన్ 22న ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. విజయ్ 65 సినిమాకు బీస్ట్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు.

శివ కార్తికేయన్ హీరోగా డాక్టర్ సినిమాను తెరకెక్కించిన ఏకంగా విజయ్ సినిమా ఆఫర్ అందుకున్నాడు. ఇమేజ్ కు సరిపోయేలా పక్కా మాస్ కమర్షియల్ కథను సిద్ధం చేశాడు నెల్సన్. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఈ విషయం అర్థమైపోతుంది. చేతిలో ఒక గన్ పట్టుకొని అదిరిపోయే ఫోజులు ఇచ్చాడు దళపతి. ఇది చూసిన తర్వాత అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఏమున్నాడురా బాబు అంటూ సోషల్ మీడియాలో పోస్టర్ ను వైరల్ చేస్తున్నారు. అర్ధ‌రాత్రి మూవీ నుండి మ‌రో పోస్ట‌ర్ విడుద‌ల చేసి స్ట‌న్ చేశారు. ఈ పోస్ట‌ర్ కూడా ఫ్యాన్స్ ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. సన్ పిక్చర్స్ ఈ సినిమాలో దాదాపు 120 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా 80 కోట్ల పారితోషికం అందుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. తెలుగులో కూడా బీస్ట్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బీస్ట్ నుండి మ‌రో స‌ర్‌ప్రైజ్
బీస్ట్ నుండి మ‌రో స‌ర్‌ప్రైజ్
బీస్ట్ నుండి మ‌రో స‌ర్‌ప్రైజ్

ట్రెండింగ్‌

Advertisement