Bangarraju | తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ హీరోలకు కాలమంతగా కలిసి రావడం లేదు. చిరంజీవి సైతం సరైన విజయం కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నాడు. ఇక బాలకృష్ణ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత ఆయన చేసిన పైసా వసూల్, ఎన్టీఆర్ కథానాయకుడు, మహా నాయకుడు, రూలర్ సినిమాలు అత్యంత దారుణంగా నిరాశ పరిచాయి. వరుస ఫ్లాపులతో మార్కెట్ కూడా భారీగా పడిపోయింది. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ బోయపాటి తెరకెక్కిస్తున్న అఖండ సినిమాపైనే ఉన్నాయి. ఇక మరో సీనియర్ హీరో నాగార్జున దీనికి మినహాయింపు కాదు. ఆయన కూడా సరైన విజయం అందుకుని చాలా కాలం అవుతుంది. దీంతో ఇప్పుడు ఆయన ఆశలన్నీ బంగార్రాజు సినిమాపైనే ఉన్నాయి.
2016 లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన తర్వాత నాగార్జున కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్ లేదు. ఊపిరి సినిమా జస్ట్ ఓకే అనిపించింది. భారీ అంచనాల మధ్య వచ్చిన దేవదాస్, మన్మథుడు 2, వైల్డ్ డాగ్ లాంటి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఇలాంటి సమయంలో ఈయన ఆశలన్నీ బంగార్రాజు సినిమా పైనే ఉన్నాయి. ఐదేళ్ల కిందట వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ ఇది. కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. సంక్రాంతి విడుదలకు సన్నాహాలు చేస్తున్నాడు నాగార్జున. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆయనకు జోడీగా కృతి శెట్టి నటిస్తుంది. రమ్యకృష్ణ మరోసారి మెయిన్ హీరోయిన్ పాత్రలో కనిపిస్తోంది. బంగార్రాజు సినిమా నాగార్జున కెరీర్‌కు ఓ రకంగా చావోరేవో అన్నట్లు తయారైంది. ఈ సినిమాతో తన సత్తా చూపించి.. మార్కెట్ ఇంకా పడిపోలేదు అని నిరూపించుకునే పనిలో పడ్డాడు నాగార్జున.
మరోవైపు సంక్రాంతికి ట్రిపుల్ ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ లాంటి సినిమాలు వస్తున్నాయి. వీటి మధ్య బంగార్రాజు పోటీకి సిద్ధమవుతున్నాడు. 2016లో కూడా ఇలాగే భారీ సినిమాల నడుమ సోగ్గాడే చిన్ని నాయనా సినిమా విడుదల చేశాడు నాగార్జున. నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, ఎక్స్‌ప్రెస్ రాజా లాంటి సినిమాలతో పోటీపడి బ్లాక్ బస్టర్ ఫలితం అందుకుంది సోగ్గాడే చిన్ని నాయనా. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాడు నాగార్జున. తాజాగా విడుదలైన మొదటి సింగిల్ కూడా యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మొత్తానికి బంగార్రాజు సినిమాతో నాగార్జున ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Laddunda: స్వర్గంలో లడ్డుండా పాటకు బంగార్రాజు అదిరిపోయే స్టెప్పులు..!
Bangarraju | ఇంతకీ బంగార్రాజులో రంభ, ఊర్వశి, మేనకలు ఎవరు..?
నేను ఏ సాంగ్ చేయడం లేదు: పాయల్ రాజ్‌పుత్
Vaishnavi Ganatra | ‘నాగ్ సార్ నుంచి చాలా నేర్చుకున్నా’
Nagarjuna: కొడుకులతో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపుతున్న నాగ్.. కారణమేంటో?