Bandla Ganesh | తిరుమల శ్రీవారి మొక్కు తీర్చుకునేందుకు సినీ నిర్మాత బండ్ల గణేష్ సిద్ధమయ్యారు. గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆయన ఎలాంటి మచ్చ లేకుండా క్షేమంగా విడుదలవ్వాలని కోరుకుంటూ బండ్ల గణేష్ వేంకటేశ్వర స్వామికి మొక్కుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తన కోరిక నెరవేరడంతో, ఆ మొక్కును తీర్చుకోవడానికి షాద్‌నగర్ నుండి తిరుమల వరకు ‘మహా పాదయాత్ర’ చేపట్టాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 19వ తేదీన షాద్‌నగర్‌లోని తన స్వగృహం నుంచి భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించి ఈ పాదయాత్రను ప్రారంభించనున్నారు. కాలినడకన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోనున్నట్లు బండ్ల గణేష్ వెల్లడించారు.