కమెడియన్‌గా ఇండస్ట్రీకి వచ్చి.. నటుడిగా గుర్తింపు తెచ్చుకుని.. పెద్ద సినిమాలతో ఒక్కసారిగా సంచలన నిర్మాతగా మారిపోయాడు బండ్ల గణేశ్. చాలా ఏళ్ల తర్వాత ఈయన మళ్లీ నటుడిగా బిజీ అవుతున్నాడు. ఈయన హీరోగా కూడా మారుతున్నాడు. భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేశ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న సినిమా షూటింగ్ మొదలైంది. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు డేగల బాబ్జీ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. చిరుత సినిమాలో రామ్ చరణ్ మాదిరి కేవలం కళ్లు మాత్రమే చూపిస్తూ పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు బండ్ల గణేశ్. ఈ పోస్టర్‌కు మంచి స్పందన వస్తుంది.
Here's the FirstLook of @BandlaGanesh In and As #DegalaBabji
— BA Raju's Team (@baraju_SuperHit) September 17, 2021
Directed by Venkat Chandra
💰💰 – Swathi Chandra
Co Producer – Muppa Ankammarao
🎼- Lynus Madiri
🎥 – Arun Devineni pic.twitter.com/EvFd4H1z47
ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ “తమిళ హిట్ ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’కి రీమేక్ ఇది. తమిళంలో ఆర్. పార్తిబన్ పోషించిన పాత్రను తెలుగులో బండ్ల గణేశ్ చేస్తున్నారు. ఈ పాత్ర కోసం బండ్ల గణేశ్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఆయన లుక్, యాక్టింగ్ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. నాన్‌స్టాప్‌గా సింగిల్ షెడ్యూల్లో సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాం” అని చెప్పారు. ఈ చిత్రానికి ఈ చిత్రానికి కళా దర్శకత్వం గాంధీ అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా అరుణ్ దేవినేని ఉన్నారు. సీనియర్ రైటర్ మరుధూరి రాజా మాటలు రాస్తున్నారు. లైనస్ మధిరి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు వెంకట్ చంద్ర దర్శకుడు. ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’ను హిందీలో అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. చెన్నైలో ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. హిందీలో ఈ చిత్రానికి పార్తీబన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కమెడియన్, నిర్మాతగా పర్లేదు అనిపించిన బండ్ల గణేశ్.. హీరోగా ఏం చేస్తాడో..?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Lobo: లోబో, ఉమా దేవిల మధ్య లవ్ ట్రాకా.. ఏం జరుగుతుంది?
అఖిల్ కోసం మళ్లీ ఆ పని చేస్తున్న పూజా హెగ్డే..
బిగ్ బాస్ వేదికగా షణ్ముఖ్‌పై తన ప్రేమను వ్యక్తపరిచిన దీప్తి
Maestro Review: మాస్ట్రో రివ్యూ.. ఆకట్టుకున్న క్రైమ్ థ్రిల్లర్
Bigg Boss: బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టను, ఎవరికి సపోర్ట్ చేయనన్న హాట్ యాంకర్