ఒకప్పుడు హీరోయిన్ డబ్బింగ్ చెప్పడం అనేది అంత ఈజీగా జరిగేది కాదు. నటించడం వరకే తమ పని అయిపోయింది అంటూ వెళ్లి పోయేవాళ్లు. కానీ ఇప్పుడు తెలుగు రాకపోయినా కూడా నేర్చుకుని మరీ డబ్బింగ్ చెబుతున్నారు. ఇప్పటికే సాయిపల్లవి, సమంత, రష్మిక మందనా వంటి హీరోయిన్లు సొంతంగా డబ్బింగ్ చెప్పి మెప్పించగా.. ఇప్పుడు పూజా హెగ్డే కూడా సొంతంగా డబ్బింగ్ చెబుతోంది.
తాజాగా అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా కోసం డబ్బింగ్ చెబుతోంది పూజా హెగ్డే. ఇప్పటికే ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సినిమాతో పాటు అల వైకుంఠపురంలో సినిమాకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పింది. ఈ సినిమాల్లో తన సొంత గాత్రంతో ప్రేక్షకులను మెప్పించింది. వాటిలో పూజా హెగ్డే గొంతుకు మంచి రెస్పాన్సే రావడంతో తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా డబ్బింగ్ చెప్పింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా బయటికి వచ్చాయి.
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ టీం విడుదల చేసిన ప్రతి అప్డేట్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్యే విడుదలైన లెహరాయి పాటకు కూడా యూట్యూబ్‌లో అనూహ్య స్పందన వస్తోంది. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో లవ్లీగా ఉండేలా డిజైన్ చేస్తారు. అందుకే ఆయన చిత్రాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అఖిల్ అక్కినేని, పూజా హెగ్డేల మధ్య కూడా అలాంటి కెమిస్ట్రీ ఉండేలా డిజైన్ చేశారు. అక్టోబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Lobo: లోబో, ఉమా దేవిల మధ్య లవ్ ట్రాకా.. ఏం జరుగుతుంది?
బిగ్ బాస్ వేదికగా షణ్ముఖ్‌పై తన ప్రేమను వ్యక్తపరిచిన దీప్తి
Maestro Review: మాస్ట్రో రివ్యూ.. ఆకట్టుకున్న క్రైమ్ థ్రిల్లర్
Bigg Boss: బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టను, ఎవరికి సపోర్ట్ చేయనన్న హాట్ యాంకర్