మైదా పిండి: ఒక కప్పు, అరటిపండ్లు: రెండు, పసుపు: అర టీస్పూన్, చక్కెర: అర కప్పు, పాలు: పావు కప్పు, నూనె: కొద్దిగా.
మిక్సీ జార్లో అరటిపండ్లు, మైదా, పసుపు, పాలు, చక్కెర వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి వేడయ్యాక ఒక టీస్పూన్ నూనె వెయ్యాలి. అప్పటికే సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని గరిటెతో వేసి దోశలా పరవాలి. రెండు వైపులా నూనెవేస్తూ సన్నని మంటపై కాలిస్తే నోరూరించే అరటి దోశ సిద్ధం.