నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ వీరసింహారెడ్డి (Veera Simha Reddy). సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. కాగా తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. తాజా అప్డేట్ ప్రకారం వీరసింహారెడ్డి చిత్రీకరణ ఆదివారం ముగిసింది. దీనికి సంబంధించి టీం త్వరలోనే అధికారిక అప్డేట్ కూడా ఇవ్వనున్నట్టు సమాచారం.
బాలకృష్ణ (Balakrishna) టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించనున్నట్టు ఇప్పటివరకు విడుదలైన పాటలతో అర్థమవుతుంది. ఈ సినిమా నుంచి విడుదలైన జై బాలయ్య మాస్ ఆంథెమ్ , సుగుణ సుందరి, మా బావ మనోబావాలు సాంగ్స్ ను మ్యూజిక్ లవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన వరలక్ష్మి శరత్‌కుమార్‌తోపాటు హనీ రోజ్, చంద్రికా రవి, పీ రవిశంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ధునియా విజయ్ విలన్‌గా నటిస్తున్నాడు.
జై బాలయ్య మాస్ ఆంథమ్ సాంగ్..
సుగుణ సుందరి లిరికల్ వీడియో సాంగ్..
మా బావ మనోభావాలు సాంగ్ ప్రోమో..
Read Also : Rashmika Mandanna | సిద్దార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్నా స్కూటర్ రైడ్.. ట్రెండింగ్‌లో వీడియో
Read Also : Sushant Singh Rajput | సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది హత్యే : రూప్‌కుమార్ షా
Read Also : Hari Hara Veera Mallu | హరిహరవీరమల్లుకు ఆర్ఆర్ఆర్ క్రేజ్ కలిసొచ్చేనా..?