Hari Hara Veera Mallu | హరిహరవీరమల్లుకు ఆర్ఆర్ఆర్ క్రేజ్ కలిసొచ్చేనా..?
క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu) మూవీకి సంబంధించిన భారీ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ యాక్షన్ కొరియోగ్రఫర్ విజయ్ మాస్టర్ నేతృత్వంలో రామోజీ ఫిలింసిటీలో ఇటీవలే పూర్తయింది.
పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu). పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీకి సంబంధించిన భారీ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ యాక్షన్ కొరియోగ్రఫర్ విజయ్ మాస్టర్ నేతృత్వంలో రామోజీ ఫిలింసిటీలో ఇటీవలే పూర్తయింది. కాగా పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ రెడీ చేశారు మేకర్స్.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్టార్ అయినప్పటికీ పాన్ ఇండియా ఇమేజ్ మాత్రం లేదు. కానీ డైరెక్టర్ క్రిష్ మాత్రం బాలీవుడ్ జనాలకు కొత్తేమీ కాదు. అందులోనా హరిహరవీరమల్లుకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి (MM Keeravani) సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ (RRR)లో ఈయన కంపోజ్ చేసిన నాటు నాటు ది అకాడమీ అవార్డుల్లో షార్ట్ లిస్ట్ కూడా అయింది.
జాతీయ స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయిలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు కీరవాణి. కీరవాణి చేస్తున్న సినిమా కావడంతో హరిహర వీర మల్లు మ్యూజిక్ రైట్స్‌తోపాటు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కూడా సొంతం చేసుకునేందుకు చాలా పెద్ద కంపెనీలు పోటీపడుతున్నాయని బీటౌన్ సర్కిల్ సమాచారం. నిర్మాత ఏఎం రత్నం టీం ఇప్పటికే కోసం పాన్ ఇండియా రిలీజ్‌కు గ్రాండ్‌గా ప్లాన్ చేసినప్పటికీ.. ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం సినిమా మార్కెట్ పెంచేందుకు సహకరిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అంతర్జాతీయ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన ఆర్ఆర్ఆర్ క్రేజ్.. హరిహరవీరమల్లుకు కూడా బాగా ఖచ్చితంగా కలిసొస్తుందంటున్నా సినీ విశ్లేషకులు. మరి ఆర్ఆర్ఆర్ క్రేజ్‌ను హరిహరవీరమల్లు ఎంతలా క్యాష్ చేసుకుంటాడనేది చూడాలంటున్నారు సినీ జనాలు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

