తెలుగు సినీరంగంలో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ తెరమీదకు రాబోతున్నట్లు సమాచారం. ‘మార్కో’ వంటి వయొలెంట్ సినిమాతో ఒక్కసారిగా దక్షిణాది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు మలయాళీ దర్శకుడు హనీఫ్ అదేని. విపరీతమైన హింస, రక్తపాతం ఉందంటూ విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. ైైస్టెలిష్ మేకింగ్, డిఫరెంట్ ప్రజెంటేషన్‌తో ఈ సినిమా టార్గెటెడ్ ఆడియెన్స్‌ని మెప్పించింది.
తాజాగా దర్శకుడు హనీష్ అదేని తెలుగులో బాలకృష్ణ కథానాయకుడిగా ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారనే వార్త టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు తెరకెక్కించబోతున్నారని, త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం. ఈ సరికొత్త కాంబో తాలూకు వార్తలతో బాలకృష్ణ అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.
హనీఫ్ అదేని ైస్టెలిష్ మేకింగ్, బాలకృష్ణ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కలిస్తే గూజ్బంప్స్ ఖాయమని అంటున్నారు. మరి ఈ సినిమా తాలూకు వార్తల్లో నిజమెంతుందో తెలియాలాంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు.