Balakrishna – Jr NTR | టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవాటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా ఈ వేడుకను ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి తదితర సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే టాలీవుడ్ అగ్ర నటులుతో తదితరులకు ఆహ్వానాన్ని అందించారు. అయితే అందరికి ఇచ్చారు కానీ సొంత కుటుంబంలోని జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు నందమూరి కళ్యాణ్‌కు మాత్రం ఇన్విటేషన్ పంపలేదని వార్తలు వస్తున్నాయి. ఇక సొంత ఫ్యామిలీకి ఆహ్వానం పంపకపోవడంతో నందమూరి ఫ్యాన్స్ రెండుగా చీలుతారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఈ కామెంట్లపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందిస్తూ.. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అగ్ర కథానాయకులతో పాటు అందరికి ఇన్విటేషన్ వెళ్లినట్లు తెలిపారు. ఫిజికల్ ఇన్విటేషన్ ఎవరికైనా రాకపోతే తెలుగు ఇండస్ట్రీ మన కుటుంబం అని భావించి ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం అంటూ చెప్పుకోచ్చారు. మరోవైపు ఈ వేడుకలో పాల్గోనడానికి తారక్ ఇంట్రెస్ట్‌గా లేడని సమాచారం. అందుకే తన అమ్మమ్మ ఊరు అయిన కుందపూర్‌కు వెళ్లినట్లు టాక్.
Also read..