Aditya 999 Max | సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తొలి భారతీయ సైన్స్ ఫిక్షన్ సినిమాగా వచ్చిన చిత్రం ఆదిత్య 369 (Aditya 369). టైం మిషన్ కాన్సెప్ట్‌తో బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు వర్షం కురిపించి.. ఆల్‌టైమ్ సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ ఎవర్గ్రీన్ సినిమాకు సీక్వెల్ రాబోతుందంటూ ఇప్పటికే చాలా వార్తలు తెరపైకి వచ్చాయి.
మూవీ లవర్స్‌తోపాటు నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ టైం రానే వచ్చింది. ఆదిత్య 369 సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చేశాడు బాలకృష్ణ. ఈ సీనియర్ యాక్టర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే ఎపిసోడ్ 6 లుక్‌తో సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చేశాడు. వ్యోమగామిగా మారిపోయిన్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆదిత్య 999 మ్యాక్స్ (Aditya 999 Max) టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీలో నందమూరి మోక్షజ్ఞ లీడ్ రోల్లో కనిపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్. ఇదే నిజమైతే మోక్షజ్ఞ కెరీర్లోనే వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సీక్వెల్‌పై ఫుల్ ఎపిసోడ్లో పూర్తి వివరాలు వెల్లడించబోతున్నాడు బాలయ్య. డిసెంబర్ 6న ఆహాలో ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.
మోక్షజ్ఞ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసిందే. మరి ఆదిత్య 369 రెండో సినిమాగా రాబోతుందా..? అనేది తెలియాల్సి ఉంది.
The Time Machine is back, and it’s BIGGER than ever 🕰️✨
God of Masses #NandamuriBalakrishna announces the sequel for the iconic Aditya 369 titled #Aditya999Max with @MokshNandamuri in the lead role🔥
Catch #NBK revealing exclusive deets about the film on #UnstoppableWithNBK4… pic.twitter.com/aLyWkb1isU
— BA Raju’s Team (@baraju_SuperHit) December 4, 2024
Ram Gopal Varma | సినిమా టికెట్ ధరల మీదే ఏడుపెందుకు.. రాంగోపాల్ వర్మ పుష్ప 2 ఇడ్లీల కథ చదివారా..?
They Call Him OG | ఎప్పుడొచ్చామన్నది కాదు అన్నయ్యా.. ట్విటర్‌లోకి ఓజీ డైరెక్టర్ గ్రాండ్ ఎంట్రీ