తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. డబ్బింగ్ సినిమాలతో మొదలైన విజయ్ ప్రభంజనం.. ఇప్పుడు డైరెక్ట్ సినిమాల వరకు వచ్చింది. ఉప్పెన లాంటి సినిమాతో తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు ఈయన. విజయ్ సేతుపతి సినిమా అంటే చాలు ఇప్పుడు ఆడియన్స్ కూడా ఎగురుకుంటూ వెళ్లిపోతున్నారు. కేవలం హీరోగా మాత్రమే చేస్తానని కాకుండా కథ నచ్చితే విలన్‌గానూ నటిస్తున్నాడు విజయ్. మాస్టర్ సినిమా తెలుగులో అంత పెద్ద విజయం సాధించిందంటే.. విజయ్‌తో పాటు విజయ్ సేతుపతి కూడా కారణమే. ఉప్పెన విజయం పూర్తిగా విజయ్‌కే అంకితం ఇచ్చినా తప్పు లేదేమో..?
అంతగా మాయ చేస్తున్న ఈయనపై ఇప్పుడు బాలయ్య అభిమానులు గరమ్ అవుతున్నారు. సోషల్ మీడియాలో విజయ్ సేతుపతిపై ట్రోలింగ్ చేస్తున్నారు. అదేంటి.. ఆయనేం చేశాడు అనుకుంటున్నారా..? ఏం చేయలేదు.. సింపుల్‌గా బాలయ్య సినిమాలో నటించడానికి నో చెప్పాడంతే. బాలకృష్ణ త్వరలోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చేసింది. క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈయన నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నాడు.
వేటపాలెం నేపథ్యంలో కథ సాగనుంది. ఈ సినిమాకు కూడా తమన్ సంగీతం అందించబోతున్నాడు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతిని అనుకున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. అయితే దీనికి ఆయన నో చెప్పినట్లు తెలుస్తుంది. ఇక్కడే బాలయ్య అభిమానులకు కోపం తెప్పించింది. నో చెప్పడం పెద్ద సమస్య కాదు.. కానీ రెండేళ్ల కింద సైరా సినిమాలో చిన్న పాత్రలో నటించాడు విజయ్. అడిగితే చిరంజీవిపై ఉన్న ప్రేమతోనే ఈ సినిమా చేశానని చెప్పాడు. మరి అదే చిరంజీవికి సమకాలికుడు అయిన బాలయ్యతో నటించడానికి ఏంటి సమస్య అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇక్కడే ఆయన్ని సెంటర్ చేసి ట్రోలింగ్ మొదలు పెట్టారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Nani vs Theater Owners | సీన్ యూ టర్న్.. నానికి క్షమాపణలు చెప్పిన థియేటర్స్ అసోసియేషన్
OTT ఎఫెక్ట్ : ఓవర్సీస్లో టాలీవుడ్‌కు ఊహించని దెబ్బ !
రకుల్ ప్రీత్ సింగ్‌కు బంపర్ ఆఫర్ ఇస్తున్న అల్లు అర్జున్
ఈ హీరోయిన్ నాన్‌స్టాప్‌గా 48 గంటలు పడుకుంటుందట..!
KOTA: నమస్కారం చెప్పా, వెంటనే బాలయ్య నాపై ఉమ్మాడు: కోట
ప్రభాస్ ను పెళ్లి చేసుకోవాలనుందట..!