Daaku Maharaaj | నందమూరి బాలకృష్ణ (Balakrishna) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే అనే చెప్పాలి. తన అభిమానులకు కావాల్సిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఎప్పుడూ ముందుంటే బాలయ్య తాజాగా ఎన్బీకే 109 (NBK109)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలిసిందే. బాబీ (Bobby) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ డాకు మహారాజ్ (Daaku Maharaaj) టైటిల్‌తో రాబోతుంది.
ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇటీవలే టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్‌తో ప్రకటించారు. ఇక ప్రమోషన్స్ ఈ సారి గట్టిగానే చేయాలని ఫిక్స్ అయినట్టు తాజా అప్డేట్ ఒకటి క్లారిటీ ఇచ్చేసంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం యూఎస్ఏలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారట.
టెక్సాస్‌లోని డల్లాస్‌లో 2025 జనవరి 4న ఈవెంట్‌ను నిర్వహించనుండగా.. బాలకృష్ణతోపాటు చిత్రయూనిట్ పాల్గొనబోతున్నట్టు టాలీవుడ్ సర్కిల్ ఇన్సైడ్ టాక్.
టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్లో.. ఈ కథ వెలుగును పంచే దేవుళ్లది కాదు.. చీకటిని పంచే రాక్షసులది కాదు.. ఆ రాక్షసులనే ఆడించే రావణుడిది కాడు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసే ఒక రాజుది.. గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది.. నన్ను గుర్తు పట్టావా..? డాకు డాకు మహారాజ్ అంటూ బాలకృష్ణ స్టైల్లో సాగుతున్న డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
ఈ చిత్రంలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. ప్రగ్యాజైశ్వాల్, చాందినీ చౌదరి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Vijay Antony | విలన్‌గా విజయ్ ఆంటోనీ మేనల్లుడి గ్రాండ్ ఎంట్రీ.. గగన మార్గన్ పోస్టర్లు వైరల్
Kissik | అల్లు అర్జున్, శ్రీలీల స్టైలిష్ డ్యాన్స్.. కిస్సిక్ ఫుల్ సాంగ్ లాంచ్ టైం ఫిక్స్
RC16 | రాంచరణ్ ఆర్సీ16 షూట్ టైం.. మైసూర్ టెంపుల్ ముందు బుచ్చి బాబు సాన