Balakrishna | ‘అఖండ’ సీక్వెల్‌గా ‘అఖండ – తాండవం’ ప్రకటించినప్పట్నుంచీ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేశాయ్. బాలయ్య ప్రస్తుతం బాబీ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. మరోవైపు బోయపాటి శ్రీను ‘అఖండ’ సీక్వెల్ పనుల్లో నిమగ్నమైపోయారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజాకార్యక్రమాలు కూడా జరిగాయి. ప్రస్తుతం బోయపాటి నటీనటుల ఎంపికపై దృష్టిసారించారు. మరోవైపు లొకేషన్స్ సెర్చింగ్ కూడా జరుగుతున్నది.
సీక్వెల్లో కూడా ప్రీ ఇంటర్వెల్లోనే ‘అఖండ’ ఎంట్రీ ఉంటుందట. ఆ సీన్‌కోసం ఓ లొకేషన్ని సెలక్ట్ చేసి, అక్కడే భారీ సెట్ నిర్మిస్తారని ఇన్సైడ్ టాక్. 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట, నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్లో ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. డబుల్ హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టే దిశగా బోయపాటి అడుగులేస్తున్నట్టు చిత్ర బృందం చెబుతున్నది.