e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News న‌న్ను క‌లిసేందుకు రావొద్దంటూ బాలకృష్ణ బహిరంగ లేఖ

న‌న్ను క‌లిసేందుకు రావొద్దంటూ బాలకృష్ణ బహిరంగ లేఖ

న‌న్ను క‌లిసేందుకు రావొద్దంటూ బాలకృష్ణ బహిరంగ లేఖ

అభిమానులే నా ప్రాణం అంటున్నాడు నందమూరి బాలకృష్ణ. ఈయనకు ఫ్యాన్స్ అంటే ఎంత యిష్టం అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే బాలయ్యను కూడా అభిమానులు మా బాలయ్య అంటూ నెత్తిన పెట్టుకుంటారు. వాళ్ళకు ఏ చిన్న కష్టం వచ్చినా కూడా వెంటనే స్పందిస్తుంటాడు బాలయ్య. నేనున్నా మీ కోసం అంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. తన అభిమానులను ఉద్దేశించి బహిరంగ లేఖ విడుదల చేసారు బాలయ్య. జూన్ 10న ఈయన పుట్టిన రోజు. ప్రతీ సంవత్సరం బాలయ్య పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంటారు అభిమానులు. తమ ఇంట్లో పండగలా చేసుకుంటారు. అయితే ఈ సారి మాత్రం పరిస్థితులు అస్సలు బాగోలేవు. అందుకే తన 61వ పుట్టిన రోజు వేడుకలును రద్దు చేయాలంటూ అభిమానులను కోరాడు బాలయ్య. అంతా తమ ఇళ్లలో ఉండి పండగ చేసుకుంటే అదే తనకు ఇచ్చే బహుమతి అంటున్నాడు ఈయన. అభిమానులను ఉద్ధేశిస్తూ బహిరంగ లేఖ విడుదల చేసారు.

నా ప్రాణ సమానులైన అభిమానులకు ..
ప్రతిఏటా జూన్ 10 వతేదీ నాపుట్టినరోజునాడు ..
నన్ను కలిసేందుకు నలుదిక్కులనుండీ తరలివస్తున్న మీ అభిమానానికి
సర్వదా విధేయుడ్ని ..
కానీ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు ..
నన్నింతటివాడ్ని చేసింది మీఅభిమానం
..ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను ..
మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు
మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు
మీ కుటుంబం తో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదినవేడుక ..
దయచేసి రావద్దని మరీ మరీ తెలియజేస్తూ ..
ఈ విపత్కాలంలో అసువులు బాసిన
నా అభిమానులకూ కార్యకర్తలకూ అభాగ్యులందరికీ నివాళులర్పిస్తూ .. అని త‌న లేఖ‌లో పేర్కొన్నారు నందమూరి బాలకృష్ణ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
న‌న్ను క‌లిసేందుకు రావొద్దంటూ బాలకృష్ణ బహిరంగ లేఖ

ట్రెండింగ్‌

Advertisement